English   

ఎర్రోడి వీరగాధ...బాలయ్యకు ఈ సారి స్ట్రాంగ్ కౌంటర్ !

naga babu counter to balakrishna on yerrodi veeragadha short film
2019-01-09 08:40:56

గత రెండు రోజులుగా బాలయ్యను మెగా బ్రదర్ నాగ బాబు టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగబాబు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ఇప్పుడు సంచలన వీడియోను విడుదల చేశారు. ఇప్పటి దాకా కొన్ని వీడియోలు చేస్తూ కౌంటర్ లంటూ పేర్కొంటున్న నాగబాబు ఇప్పుడు ఏకంగా ‘ఎర్రోడి వీరగాథ’ అనే షార్ట్ ఫిల్మ్‌ని విడుదల చేశారు. నారా రోహిత్ కి సంబందించిన ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లో బాలయ్య మాట్లాడుతూ గతంలో నేను లవర్ బే గా చేస్తే ఎవరూ చూడరని ‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టేయాలా, కడుపైనా చేసేయాలా’ అన్న వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నాగబాబు ఆ వ్యాఖ్యలకు కు కౌంటర్‌గా షార్ట్‌ఫిల్మ్‌ పేరుతో వీడియో విడుదల చేశారు. బాలకృష్ణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటించి, నిర్మించిన చిత్రం తన తండ్రి రామారావు జీవిత కధ ఆధారంగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ తెరకేక్కించగా ఈరోజు అది విడుదల కానున్న నేపథ్యంలో నాగబాబు ఈ వీడియో విడుదల చేసి కలకలం సృష్టించారు. మూడున్నర నిమిషాలు ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఓ వ్యక్తిని ఆడవాళ్లు పట్టుకుని కోడుతూ ఉండడం వాళ్లని అడ్డుకుని ఎందుకు కొడుతున్నారు అంటూ అని ఆ వ్యక్తిని నాగబాబు అడగడం కనిపిస్తుంది. ఎందుకో గానీ ఆ క్యారెక్టర్ ని నాగబాబు చిట్టి అని సంభోదించడం ఆయన చెవుల్లో ఉన్న వెంట్రుకలని బట్టి ఆయన త్రిపురనేని చిట్టి బాబు లా అనిపిస్తున్నారు. నాగబాబు ఆయనను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అనేది తెలియడం లేదు. ఈ వివాదం మీద స్పందించడానికి బాలయ్య నిరాకరించగా ఈ వివాదం ఎంత దూరం నడుస్తుందో తెలియట్లేదు.

More Related Stories