English   

యన్‌టిఆర్‌ దెబ్బకు శాతకర్ణి రికార్డు బద్దలు..!! 

NTR-Kathanayakudu
2019-01-09 15:57:53

దివంగత నటుడు, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా 'కథానాయకుడు' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద భారీ అంటే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాలయ్య కెరీర్ లోనే ఎన్నడూ లేనంతగా ప్రపంచవ్యాప్తంగా 1100 థియేటర్ లలో ఈ సినిమా విడుదలైంది. అదీ మన తెలుగు రాష్ట్రాల్లోనే 600 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో  సినిమా మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అయితే అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా ప్రీమియర్‌ షోలని నిన్న రాత్రి ప్రదర్శించారు. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు వేసిన షోలతో 'ఎన్టీఆర్' సినిమా 4,40,000 డాలర్లు (రూ. 3,09,87,000) వసూలు చేసినట్లు ఫిలిం నగర్ టాక్ది.  అంటే ఒకరకంగా ఈ కలెక్షన్స్ గతంలో బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రీమియర్‌ షో వసూళ్లను 'ఎన్టీఆర్' బీట్‌ చేసింది. అమెరికాలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రీమియర్‌ షో ద్వారా తొలి రోజు 3,75,000 డాలర్లు (రూ.2, 64,14,812) వసూళ్లు రాబట్టగా దాని సుమారుగా ఒక లక్ష డాలర్లు ఎక్కువగా వసూలు చేసి రికార్డు బద్దలుకొట్టింది.  

More Related Stories