English   

భారత ప్రధానిగా మోహన్ లాల్ !

Mohanlal
2019-01-09 16:14:29

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కేవలం హీరో పాత్రలకే పరిమితం కాక, పాత్ర నచ్చితే ఎటువంటి పాత్ర అయిన చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎన్టీఆర్ సరసన ఆయన నటించిన  జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి హిట్ సాదిచిందో మనకు తెలుసు. ఇప్పుడు ఆయన ఈయన సూర్య మూవీలో ఒక రోల్ చేస్తున్నారు. సూర్య, అఖిల్ ఫేం సాయేషా సైగల్ జంటగా రంగం ఫేం కేవీ ఆనంద్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అది సూర్యకి 37వ చిత్రం కాగా దానికి ‘కాప్పాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఇటీవలె రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో ప్రధానమంత్రి పాత్రను మోహన్ లాల్ పోషిస్తున్నట్టుగా సమాచారం. ఆయనకు సెక్యూరిటీ కమాండర్ గా సూర్య కనిపించనున్నాడట. గత ఏడాది అక్టోబర్ లో మోహన్ లాల్ పాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. మోహన్ లాల్ పాత్ర పేరు చంద్ర గాంధ్ వర్మ అని సమాచారం.  రోబో లాంటి ప్రతిష్టాత్మక సినిమాలు తెరకెక్కించిన లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. అయితే సూర్య నటించిన 'ఎన్జీకే' తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సూర్య, కెవి ఆనంద్ కాంబినేషన్లో గతంలో అయాన్(వీడొక్కడే), మాత్రన్(బ్రదర్స్) సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో హ్యాట్రిక్ అవుతుందా ? లేదా అనే టెన్షన్లో ఉన్నారు సూర్య ఆనంద్ లు. 

More Related Stories