English   

వైసీపీలో చేరిన సీనియర్ హీరో !

Bhanuchander
2019-01-09 09:27:58

ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి క్రమేణా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు తమ పార్టీలను వీడి వైసీపీ చెంతకు చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ సినీ గ్లామర్ కూడా జతచేరింది. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు పలువురు సినీనటులు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. పోసాని కృష్ణమురళీ, పృథ్వి, ఫిష్ వెంకట్, చోటా కె నాయుడు, కృష్ణుడు, జబర్దస్త్ టీం ఇలా దాదాపు చాలా మంది ఆయనకు మద్దతు పలికారు. అయితే తాజాగా ఆయన్ను పాదయాత్రలో కలిసిన్ నటుడు భాను చందర్ వైసీపీలో తీర్ధం పుచ్చుకున్నారు. ఈరోజు ప్రజా సంకల్ప యాత్ర చివరి రోజు కావడంతో జగన్ ఆ ఏర్పాట్లలో ఉండగా భాను చందర్ ఇచ్చాపుం చేరుకున్నారు. జగన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా భాను చందర్ కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వైఎస్ జగన్. అనంతరం భానుచందర్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం తన వంతు కృషి చేస్తానని,  పార్టీ అప్పజెప్పే బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. అయితే నటుడు పృధ్వీ, పోసాని ఇద్దరూ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నిస్తున్నట్టు తెస్లుతోంది. మరి భాను చందర్ కూడా అసెంబ్లీ సీటు కోసమేనా అనే విషయం తెలియాల్సి ఉంది.

More Related Stories