English   

శ్రీ దేవి బయోపిక్...శ్రీదేవి గా ఆమే !

Boney-Kapoor
2019-01-09 10:08:58

ప్ర‌స్తుతం అన్ని బాషల్లోను బ‌యోపిక్‌ ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఈరోజు విడుదల అయిన ఎన్టీఆర్ బయోపిక్ సంచలన విజయాన్ని నమోదు చేసి రికార్డులు బద్దలు చేసే దిశగా దూసుకెళుతోంది. దీంతో ఇప్పటికే చాలా మంది సినీ రంగానికి చెందినా ప్రముఖుల బయోపిక్ లను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా అందాల నటి శ్రీదేవి జీవిత నేప‌థ్యంలో ఓ సినిమా చేయాల‌ని ప‌లువురు ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వారి కంటే ముందే శ్రీదేవి భర్త బోని స్వయంగా బ‌యోపిక్ తీయాలని అనుకుంటున్నాడ‌ట‌. శ్రీదేవి గురించి పూర్తిగా తెలిసిన బోని క‌పూర్ ఆ చిత్రానికి న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని ఆమె అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీ దేవిగా చిన్నమ్మాయి ఖుషీని నటింప చేయాలనీ కూడా ప్రతిపాదనలు ఉన్నాయట. నిజానికి ఆమె అక్క జాన్వీ కంటే ఖుషీనే శ్రీదేవి పోలికలతో ఉంటుంది. దీంతో ఆమెనే తల్లిలా నటింప చేయాలనీ భావిస్తున్నాడట. అయితే వేరెవరూ ప్రకటన చేయక ముందే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయాలనీ బోనీ భావిస్తున్నారట. అంతేకాక శ్రీదేవి జీవితంపై సినిమా తాను తప్ప ఇంకెవరూ తీయకుండా ఉండేందుకు ఆ సినిమాకి కాపీ రైట్స్‌ కూడా తీసుకునే ప‌నిలో బోనీ ఉన్నాడ‌ని స‌మాచారం. మ‌రి బోనీ తన పాత్ర కోసం ఏ స్టార్ హీరోను సంప్రదిస్తారో మరి. 

More Related Stories