English   

అఖిల్ హీరోయిన్ తో తమిళ హీరో పెళ్లి ?

sayyeshaa
2019-01-09 12:17:26

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఒకతప్పుడు పెద్ద హడావుడి అయ్యేది, న్యూస్ అయ్యేది. కానీ కాలానుగుణంగా ఇప్పుడు ఆ వార్తలు కూడా కామన్ వార్తలు అయిపోయాయి. ఎందుకంటే విరివిగా జరుగుతున్న ఇండస్ట్రీ ప్రేమ పెళ్లిల్లె కారణం. అయితే తాజాగా తమిళ హీరో ఆర్యకు సంబందించిన ఒక వార్త కోలీవుడ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే తెలుగులో అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కాలం కలిసి రాక తమిళనాడు ట్రైనెక్కిన నటి సాయేషా సైగల్‌ తో ఆర్య పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట. గత కొన్ని రోజులుగా వీరు ఒకర్నొకరు ఇష్టపడుతున్నట్లు తమిళ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. ప్రేమ మాత్రమె కాదు వారు ఈ ఏడాదిలో పెళ్లి కూడా చేసుకోవాలని భావిస్తున్నట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఆర్య, సాయేషా కలిసి గజినీ కాంత్‌ సినిమాలో నటించారు. గత ఏడాది ఆగస్టులో ఈ సినిమా తమిళంలో విడుదలైంది. ఈ షూట్ సమయంలో వీరి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమకు దారి తీసిందని అంటున్నారు. ప్రముఖ నటుడు దిలీప్‌ కుమార్‌, సైరా భానుల మనవరాలే సాయేషా. అయితే రాన్నున్న రెండు నెలల్లో ఈ ఇద్దరు తమ పెళ్లి గురించి అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.  చూడాలి ఇంకో సినిమా పెళ్లి అవుతుందో లేదో ?

More Related Stories