English   

ఏఎన్నార్ బయోపిక్...క్లారిటీ ఇచ్చిన నాగ్ !

Nagarjuna
2019-01-10 04:58:42

ప్ర‌స్తుతం అన్ని బాశాలలోను బ‌యోపిక్‌ ల సీజన్ న‌డుస్తుంది. సినిమా, క్రీడా, ఇలా ఒకరంగానికి పరిమితం కాకుండా దాదాపు అన్ని రంగాల‌కి చెందిన ప్ర‌ముఖుల జీవిత చరిత్ర తెర‌కెక్కుతున్న ఈ సినిమాలకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇటీవ‌ల తెలుగు సినీ రంగానికి చెందిన సావిత్రి బయోపిక్ గా మ‌హాన‌టి, ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన క‌థానాయ‌కుడు చిత్రాలు సూప‌ర్ హిట్ అవడంతో. త్వ‌ర‌లో మరిన్ని బ‌యోపిక్స్ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఆయన తనయుడు బాలకృష్ణ తెరకెక్కించగా ఏఎన్నార్ బ‌యోపిక్ ఆయన తనయుడు నాగర్జున తెరేకేక్కించేందుకు ఆస‌క్తి చూపుతున్నారా లేదా అనే దాని పై సస్పెన్స్ నెలకొంది. ఎన్టీఆర్ బయోపిక్ మొదలయినప్పటి నుండి ఎన్ని మార్లు నాగ్‌ ని అడిగినా ఆయ‌న స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు. తాజాగా నిన్న ఆయన తిరుమల వెంకన్నని చాముండేశ్వరీనాథ్‌ తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న అందరికి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. అలాగే ఈ సంవ‌త్సరం ప్ర‌తి ఒక్క‌రికి మంచి జ‌ర‌గాల‌ని కోరారు. ఈ సమయంలో ఆయన చివ‌రిగా దేవ‌దాస్ సినిమా తర్వాత మరే సినిమా ప్రకటించలేదని విలేఖరులు ప్రస్తావించగా కొత్త సినిమా విష‌యాల‌ని త్వర‌లోనే ప్ర‌క‌టిస్తానని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో కొందరు మీ తండ్రి జీవిత నేప‌థ్యంలో సినిమా తీస్తారా అని అడ‌గ‌గా, అయ్యో అంటూ నవ్వేసిన నాగార్హున త్వరలోనే అన్నీ చెబుతానంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. దీంతో ఏఎన్ఆర్ బ‌యోపిక్‌ పట్టాలు ఎక్కడం లాంచనమే. 

More Related Stories