English   

యష్ బర్త్ డేకి అభిమాని ఆత్మహత్య !

Yash
2019-01-10 12:17:48

అభిమానం వెర్రి తలలు వేసి ఏమి చేస్తున్నారో కూడా తెలియనంతగా చేస్తున్న కొన్ని పనులు అభిమానుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ న‌టించిన కేజీఎఫ్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి కన్నడ చిత్రసీమలోనే మునుపెన్నడూ లేనంతగా ఈ సినిమా విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఊపులో ఉన్న య‌ష్ త‌న పుట్టిన రోజు వేడుకల‌ని బెంగుళూరులోని స్వగృహంలో జ‌రుపుకున్నాడు. ఆయ‌న పుట్టినరోజు సంద‌ర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపి, కుదిరితే ఫోటోలు కూడా తీసుకుందామని ఆయన అభిమానులు ఇంటి బయట భారీ ఎత్తున నిలిచి ఉన్నారు. ఈ నేపధ్యంలో అంతమందిని లోపలి వదిలితే హీరోకి ఇబ్బంది కలుగుతుందని ఎవరినీ లోపలి వదలడం లేదు. 

అయితే రవి అనే వ్య‌క్తి యష్ వీరాభిమాని, త‌న అభిమాన హీరోని పుట్టిన రోజు నాడు ఎలా అయినా క‌ల‌వాల‌ని ప్ర‌య‌త్నించాడు. కానీ ఎంతకీ సెక్యూరిటీ సిబ్బంది లోప‌ల‌కి వదలకపోవ‌డంతో మ‌న‌స్థాపానికి గురైన సదరు అభిమాని పెట్రోల్ పోసుకొని యష్ ఇంటి బయటే ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు.  70 శాతం కాలిన గాయాలైన అతణ్ని బెంగుళూరు విక్టోరియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే తన అభిమానికి ఇలా జరిగిందన్న విషయం తెలుసుకున్న య‌ష్ ఆస్ప‌త్రికి వెళ్లి ఆ వ్యక్తిని ప‌రామ‌ర్శించారు. అయితే గాయాలు ఎక్కువ కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందట. అయినా అభిమాన హీరోను చూడకపోతే ఆత్మహత్య చేసుకోవడం ఏమిటో ? ఈ అభిమానం ఎన్ని విపరీతాలకు దారి తీస్తుందో ఏమో ? 

More Related Stories