English   

తరుణ్ భాస్కర్ ఋణం వెరైటీగా తీర్చుకుంటున్న దేవరకొండ !

Vijay-Devarakonda
2019-01-10 12:23:19

హీరో విజయ దేవరకొండ అంటే అర్జున్ రెడ్డి అనేంత ఇంపాక్ట్ ఆ ఒక్క సినిమాతో ఆయన మీద పడిపోయింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయనకు ఫస్ట్ హిట్ వచ్చింది పెళ్లి చూపులు మూవీతోనే. దీంతో నేను ఆ డైరెక్టర్ కు చాలా రుణపడి ఉన్నానని విజయ్ చాలా సందర్భాల్లో చెబుతూ వచ్చే వాడు. అయితే అర్జున్ రెడ్డి ఇచ్చిన కిక్ తో ఎన్నో మూవీలు సైన్ చేసిన విజయ్ ఎప్పుడూ కిక్ కోసమే వెతుకుతూ ఉంటాడు అనుకుంటా, రౌడీ క్లబ్ అంటూ బట్టల బిజినెస్ లోకి దిగాడు. అక్కడితో ఆగక ఇప్పుడు నిర్మాతగా మారి తన కిక్ తీర్చుకోకున్నాడు అని తెలుస్తోంది. వాస్తవానికి హీరోలు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు ఎన్టీఆర్ నుండి అది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు విజయ్ కూడా స్టార్ ల దారిలోనే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఆ ఏర్పాట్లు కూడా యుద్ద ప్రాతిపదికన జరిగుపోతున్నాయి. దీనికి కారణం తక్కువ బడ్జెట్లో తన బ్యానర్లో నిర్మించే ఒక సినిమా ద్వారా హీరోగా 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ని పరిచయం చేయాలనుకుంటున్నాడు. అంటే తనకి 'పెళ్లి చూపులు' ద్వారా కెరీర్ ని నిలబెట్టినందుకు ఇలా ఆ రుణాన్ని తీర్చుకుంటున్నాడన్న మాట. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొలిక్కి వచ్చాయట. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని తెలుస్తోంది. మరి దర్శకుడిని డైరెక్ట్ చేయబోతున్న దర్శకుడు ఎవరో చూడాలి.       

More Related Stories