English   

త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదట !

Trivikram
2019-01-10 16:05:40

టాలీవుడ్ టాప్ హీరోలలో దగ్గుబాటి వెంకటేశ్ ఒకరు. రామానాయుడు సినీ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా, తన సొంత టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. ఆయన హీరోగా, త్రివిక్రమ్ దర్శకుడిగా ఏడాది క్రితం హారిక హాసిని క్రియేషన్స్ వారు సినిమా వుండనున్నట్టు అధికారికంగా ఒక ప్రకటన చేశారు. 2017లో వెంకటేశ్ పుట్టినరోజున అయన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ను కూడా అప్పట్లో వాళ్లు రిలీజ్ చేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ ఆ తర్వాత ఆ ఊసు పెద్దగా రాలేదు. అయితే వెంకటేశ్ ఈ సంక్రాంతికి 'ఎఫ్ 2' ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో తన తదుపరి సినిమాలను గురించి మాట్లాడిన వెంకటేశ్ తన అల్లుడు నాగ చైతన్యతో చేయాల్సిన వెంకీ మామ సినిమా కొన్ని కారణాల వలన ఆలస్యమైందని తాను నటించబోయే తర్వాతి సినిమా అదే నని చెప్పుకొచ్చాడు. అదే సనయంలో త్రివిక్రమ్ తో సినిమా గురించి కూడా స్పందించిన వెంకీ ఆ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోందని కానే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ తో తన సినిమా తప్పకుండా ఉంటుందని కానీ కథ సెట్ కాకపోవడమే ఈ ఆలస్యానికి కారణమని చెప్పుకొచ్చాడు. త్వరలో ఆ పని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వస్తామని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక రచయితగా త్రివిక్రమ్ 'నువ్ నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి హిట్ సినిమాలకి వెంకటేశ్ తో కలిసి పనిచేశారు. మళ్లీ ఇంతకాలానికి ఈ సినిమాకి పనిచేయనుండటం విశేషం.  

More Related Stories