English   

విజయ్ కోసం కేథరిన్ !

Vijay-Devarakonda
2019-01-10 17:31:44

‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న విజయ్‌ దేవరకొండ వరుసగా మంచి మంచి చాన్స్ లు కొట్టేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూట్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నేపద్యంలో ఈ సినిమా తరువాత క్రాంతిమాధవ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి దేవరకొండ రెడీ అవుతున్నాడు. 'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' సినిమాతో సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకొన్న ఆయన చివరిగా సునీల్‌ కథానాయకుడిగా ‘ఉంగరాల రాంబాబు’ సినిమా తీసి ఉసూరుమనిపించాడు. అయితే కేఎస్ రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథా నాయికలుగా ముగ్గురు భామలను సినిమా ఓపెనింగ్ టైంలో అనౌన్స్ చేశారు.  రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లె డి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తారని చెప్పారు, మరి ఏమయిందో ఏమో గానీ ఇప్పుడు చివరికి కేథరిన్ ను ఎంచుకున్నారట. `చ‌మ్మ‌క్ చ‌ల్లో` చిత్రంతో తెలుగు తెర‌కు నాయిక‌గా ప‌రిచ‌య‌మైన ఈ కేర‌ళ‌ కుట్టి. ఆ మధ్యలో ఎంతమంది స్టార్ హీరోలతో చేసినా అల్లు అర్జున్ స‌రైనోడుతో బ్రేక్ అందుకుంది. ఆ సినిమాలో ఎమ్మెల్యేగా నటించి మెప్పించింది. ఇక నేనే రాజు నేనే మంత్రి త‌రువాత మ‌రో తెలుగు సినిమాకి సంత‌కం చేయ‌ని కేథ‌రిన్‌ ఇప్పుడు ఈ సినిమాకి సైన్ చేసిందని చెప్తున్నారు. విజయ్ తో కలిసి ఆమె ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా సమాచారం.

More Related Stories