English   

బాహుబలిని మించిన స్టోరీతో మణిరత్నం !

Aishwarya Rai and Amitabh Bachchan to work together in Mani Ratnam’s film?
2019-01-10 19:53:13

ఇప్పటి వరకు ఇండియన్ బిగ్ స్క్రీన్ మీద వచ్చిన అతి పెద్ద పీరియాడిక్ మూవీ ఏదంటే వెంటనే తడుముకోకుండా వచ్చే సమాధానం బాహుబలి. ఇప్పుడు అంతకు మించిన సినిమాని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు మణిరత్నం. తమిక రచయిత క‌ల్కి కృష్ణ‌మూర్తి రచించిన `పొన్నియిన్ సెల్వ‌న్‌` అనే నవల ఆధారంగా ఓ సినిమాను తెరకేక్కిన్చేందుకు మణిరత్నం ప్రయత్నాలు చేస్తున్నారు. 10వ శ‌తాబ్దానికి చెందిన రాజ‌ రాజ చోళుడి క‌థ నేప‌థ్యంలో ఈ సినిమా సాగనుందని అంటున్నారు. అంతటి సినిమా, భారీ బడ్జెట్ ఉంటుంది కాబట్టి క్యాస్టింగ్ కూడా భారీగానే ఉండేట్టు చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తెలుగు, తమిళ, బాలీవుడ్ స్టార్స్ ని కలిపి ఈ సినిమా తీయనున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో నటించే తెలుగు, తమిళ స్టార్స్ ఎవరో తెలీదు కానీ ఒక ఫీమేల్ లీడ్ రోల్ కోసం ఐశ్వర్యను సంప్రదించగా ఆమె ఓకే చెప్పిందట. అలాగే ఆమె మామ మెగా స్టార్ అమితాబ్ ని కూడా ఒక కీలక రోల్ కోసం అడిగారట. అయితే దీనికి సంబందించిన పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ సినిమా మూడు భాగాలుగా ఉంటుందని, తమిళ, తెలుగు, హిందీ, మలయాళ బాషలలో విడుదల చేసేలా భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన ఈ సంక్రాంతికి రావచ్చని అంటున్నారు. సో లెట్స్ వెయిట్.

More Related Stories