English   

బోయపాటి మాస్...బాలయ్య రికార్డ్స్ చరణ్ బద్దలు

Ram-Charan
2019-01-11 16:43:27

తెలుగు సినిమా అంటే సైన్స్ కే ఒక పట్టాన అర్ధం కాని యాక్షన్ సీన్స్ ఉంటాయని అంటూ ఉంటారు ఇతర బాషల ప్రేక్షకులు. కానీ మన ప్రేక్షకులు వీటిని ఆదరిస్తున్నారు కాబట్టి దర్శకులు కూడా ఇలాంటి అర్ధం పర్ధం లేని సీన్లు తీయడానికి ఇష్టపడుతున్నారు. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటిన బాహుబలి కూడా అందుకు మినహాయింపు కాదు. తాజాగా ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే  ఈరోజు రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సంక్రాంతి సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే సినిమాలోని యాక్షన్ సీన్ల మీద సెటైర్ల వర్షం కురుస్తోంది. బోయపాటి యాక్షన్ సీన్లు బాలకృష్ణ ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ రికార్డ్లను బద్దలు కొడుతున్నాయని అంటున్నారు. బాలయ్య ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమాలో తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, ఆయన పిలిస్తే కుర్చీ దగ్గరకు రావడం లాంటి సీన్లను తలుచుకుంటే నవ్వు రాక మానదు. ఇప్పుడు బోయపాటి దెబ్బకి బాలయ్య రికార్డులన్నీ రామ్ చరణ్ బద్దలేస్తున్నాడు. సినిమాలో రామ్ చరణ్ రౌడీ గ్యాంగ్ తలకాయలు నరికితే అవి గాల్లోకి ఎగరడం, వాటిని గెద్దలు ఎత్తుకుపోవడం, వేగంగా వెళ్తోన్న ట్రైన్‌ పై నిలబడి వైజాగ్ నుండి అస్సాం వెళ్ళడం, పాముతో వివేక్ ఒబెరాయ్ కాటు వేయించుకుంటే రివర్స్లో  ఆ పాము చచ్చిపోవడం ఇలా చాలా సన్నివేశాలు నమ్మలేని విధంగా ఉన్నాయని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. అంటే బాలయ్య ఫ్యాన్ అయిన బోయపాటి చరణ్ చేత బాలయ్య రికార్డులు బద్దలు కొట్టిస్తున్నాడు అన్న మాట. 

More Related Stories