English   

బాబూ నా పెళ్లి గురించి నన్ను చెప్పనివ్వండి !

Vishal
2019-01-11 10:36:37

న‌టుడు విశాల్ వివాహం అనీషా అనే అమ్మాయితో జ‌ర‌గ‌నుందని, హైద‌రాబాద్‌ లో వీలయినంత త్వరగా వీరి ఎంగేజ్‌మెంట్ ఉంటుంద‌ని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం స్వయంగా ఆయన తండ్రి మీడియాతో చెప్పినట్టు కధనాలు వచ్చాయి. న‌డిఘ‌ర్ సంఘం కోసం కొత్త భవనం కట్టించాలని ఆ భవనం కట్టించాక ఆ భ‌వ‌నంలోనే విశాల్ పెళ్ళి చేసుకుంటాడ‌ని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయన తన పెళ్లి అరేంజ్డ్ కూడా కాదని లవ్ మ్యారేజ్ అని చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్త‌ల‌ మీద ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించని విశాల్ ఈరోజు త‌న ట్విట్టర్ లో స్పందించాడు. తన పెళ్లి గుర్తించి వ‌స్తున్న త‌ప్పుడు ఆర్టికల్స్, త‌ప్పుడు వార్త‌లు ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయని, ఇదేం బాలేదని ఆయన పేర్కొన్నాడు. ఇది నా వ్య‌క్తిగ‌త జీవితమని, తన పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించడానికి చాలా సంతోషిస్తానని, అప్ప‌టి వ‌ర‌కు త‌ప్పుడు తన పెళ్లి ప్ర‌చారం చేయ‌కండి అని విశాల్ కోరారు. విశాల్ ప్ర‌స్తుతం త‌మిళంలో టెంప‌ర్ రీమేక్ చేస్తున్నాడు. ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు.ఆయ‌న స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. 
 

More Related Stories