English   

యష్ కోసం శివగామి, సంజూ భాయ్ !

Ramya-Krishna
2019-01-11 17:49:00

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన 'కేజీఎఫ్' భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఇలా ఒక డబ్బింగ్ సినిమా ఇంత బాగా హిట్ అవడం మామూలు విషయం కాదు. రజనీ కాంత్, విజయ్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలకే ఆ క్రేజ్ ఉండేది. కానీ మొదటిసారి తెలుగులో యష్ సినిమా రావడం ఈ రేంజ్ లో ఆడడంతో ఒక్కసారిగా ఆయన క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమా క్రేజ్ కూడా ఉండగానే దాని సీక్వెల్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలెట్టేశారట. 2వ భాగానికి ఇంకాస్త స్టార్ క్యాస్టింగ్ తోడయితే బాగుంటుదని భావిస్తున్న డైరెక్టర్ బాలీవుడ్ నుండి సంజయ్ దత్, టాలీవుడ్ నుండి రమ్యకృష్ణలను తీసుకోవాలని భావిస్తున్నారట. మొదటి సినిమాకి కొనసాగింపుగా ఉండే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ, మరో పవర్ ఫుల్ రోల్ లో సంజయ్ దత్ కనిపిస్తాడని అంటున్నారు. సీక్వెల్‌ మీద అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో  చూడాలి మ‌రి.  

More Related Stories