English   

కళ్యాణ్ రామ్ సినిమా వాయిదా పడింది !

Kalyan-Ram
2019-01-11 12:37:14

ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కల్యాణ్ రామ్ ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. అయితే తాను హీరోగా నటిస్తున్న డిఫెరెంట్ సబ్జెక్ట్ '118' సినిమాతో హిట్ కోడతాననే నమ్మకంతో వున్నాడు. నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్ లుగా నటిస్తోన్న ఈ సినిమాని ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణను దాదాపు పూర్తిచేసుకుంది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడని సమాచారం. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు పీఆర్వోగా పని చేసిన మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమా తాజాగా విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ సినిమాని ఈ ఏడాది మార్చి 1వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 25నే విడుదల కావాల్సి ఉన్నా, ఇంకా కాస్త షూట్ పార్ట్ పూర్తి కాకపోవడం, అంతేకాక పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కాకపోవడంతో మార్చ్ నెలకి  వాయిదా పడింది.

More Related Stories