English   

సంక్రాంతి అల్లుడు వెంకటేష్ అవుతున్నాడా..

venkatesh
2019-01-12 07:53:34

ఒక్కోసారి అసలు అంచనాలు లేని సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగి సూపర్ హిట్లు అవుతుంటాయి. సంక్రాంతికి ఇలాంటి సీన్లు ఎక్కువగా చూస్తుంటాం. ఇప్పుడు కూడా ఇదే జరగబోతుందని ఇండస్ట్రీలో చాలా అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికే మూడు సినిమాలు విడుదలయ్యాయి. కథానాయకుడు సినిమా బాగున్న కలెక్షన్లు తీసుకురావడం లేదు. ఇంకా పేట సినిమా కూడా వసూళ్ల వేటలో వెనకబడింది. ఇప్పుడు విడుదలైన రామ్ చరణ్ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సినిమాను అలా తెరకెక్కించారు దర్శకుడు బోయపాటి శ్రీను. అభిమానులు అయితే ఆయన కనిపిస్తే కొట్టేలా ఉన్నారు. ఇలాంటి సమయంలో సంక్రాంతి ఆశలన్నీ ఎఫ్ 2 సినిమాపైనే ఉన్నాయి. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలవుతోంది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న కచ్చితంగా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు నిర్మాత దిల్ రాజు. పండక్కి ఎప్పుడూ ఈయన అంచనాలు తప్పలేదు. రెండేళ్ల కింద శతమానం భవతి స్టార్ హీరోల మధ్య విడుదల చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు కూడా ఇలాంటి మ్యాజిక్ రిపీట్ అవుతుంది అని నమ్ముతున్నారు ఈ నిర్మాత. దానికి తోడు సినిమాలో కామెడీ కూడా బాగానే ఉండటంతో కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ తమ సినిమాకి వస్తారని నమ్ముతున్నారు దిల్ రాజు. ఇదంతా చూస్తుంటే ఈ సంక్రాంతికి ఎఫ్2 సంక్రాంతి విజయదుందుభి మోగించేలా కనిపిస్తున్నారు.

More Related Stories