English   

బోయపాటికి బాలకృష్ణ ఒక్కడే దిక్కా..

Boyapati Srinu and balakrishna next film shooting starts from february
2019-01-12 01:33:00

ఇన్నిరోజులు బోయపాటి సినిమా అంటే కాస్తో కూస్తో నమ్మకం ఉండేది. ఈయన సినిమా వస్తుందంటే కచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో కనిపించేది. కథ లేకపోయినా కూడా ఎమోషన్స్ తోనే సినిమాలు నడిపిస్తాడు అని నమ్మకం అయితే నిర్మాతల్లో కూడా కనిపించేది. కానీ ఇప్పుడు ఒకే ఒక్క సినిమాతో అన్ని పోగొట్టుకున్నాడు బోయపాటి శ్రీను. రామ్చరణ్ హీరోగా ఆయన తెరకెక్కించిన వినయ విధేయ రామ ఆల్టైమ్ డిజాస్టర్ దిశగా పరుగులు తీస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో ఈ సినిమాకు ఇంత దారుణమైన రివ్యూ లు కానీ టాక్ కానీ రాలేదు. అసలు ఈ సినిమాను రాంచరణ్ ఓకే చేశాడు అంటూ ఆయనకు కూడా విమర్శలు పడుతున్నాయి. బోయపాటి ని అయితే మాములుగా వదిలిపెట్టడం లేదు అభిమానులు. సోషల్ మీడియాలో ఉదయం నుంచి బోయపాటి శ్రీను పై సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు రామ్ చరణ్ సినిమా టాక్ చూసి బాలయ్య అభిమానులు కూడా బెదిరిపోతున్నారు. దీనికి కారణం అయిన తర్వాత సినిమా బాలకృష్ణ తోనే ఉండడం. కానీ ఇతర హీరోలతో సినిమాలు ఎలా చేసినా కూడా బాలకృష్ణ విషయానికి వచ్చేసరికి బోయపాటి శ్రీను రెచ్చిపోతాడని నమ్ముతున్నారు అభిమానులు. సింహా, లెజెండ్ సినిమాలో దీనికి ఉదాహరణ. లెజెండ్ కు ముందు దమ్ము సినిమా ఫ్లాప్ ఇచ్చాడు కానీ బాలకృష్ణ వచ్చేసరికి సీన్ మారిపోయింది. ఇప్పుడు కూడా వినయ విధేయ రామ సినిమా నుంచి బయటకు వచ్చి బాలయ్య కు బ్లాక్ బస్టర్ ఇస్తాడని నమ్ముతున్నారు అభిమానులు. ఈ టైం లో బోయపాటి కావలసిన హీరో కూడా బాలకృష్ణ ఒక్కడే. ఆయన అయితేనే మళ్లీ రెచ్చిపోతాడు ఈ మాస్ డైరెక్టర్. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది.

More Related Stories