English   

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు రామ్ చరణ్.. దర్శకుడు మాత్రం ఆయనే...

Charan
2019-01-12 04:13:07

ఇప్పుడు సోషల్ మీడియాలో.. తెలుగు ఇండస్ట్రీ లో ఎక్కడ విన్నా కూడా రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమా గురించే చర్చ నడుస్తుంది. అసలు ఈ సినిమాను చరణ్ ఎందుకు చేశారు అంటూ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న లాభం లేదు. ఇప్పుడు ఈ విషయం అర్థం కావడం లేదు అభిమానులకు. మరిముఖ్యంగా బోయపాటి శ్రీను అప్పుడు ఎన్టీఆర్ ని ఎలా అయితే ముంచేసాడో ఇప్పుడు రామ్ చరణ్ ను అంతకంటే దారుణంగా ముంచేసాడు. కనీసం దమ్ము సినిమాకు బిలో యావరేజ్ టాక్ వచ్చింది.. కానీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాకు మాత్రం డిజాస్టర్ అనే మాట కూడా తక్కువే అంటున్నారు. అంత దారుణంగా ఈ సినిమాను తీశారు బోయపాటి శ్రీను. రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ కు ఇది మామూలు షాక్ కాదు. ఆర్.ఆర్ ఆర్ ముందు హిట్టు కొట్టి అదే జోరుతో రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అనుకున్నాడు రామ్ చరణ్. కానీ ఆయన ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఊహించని విధంగా బోయపాటి శ్రీను కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అప్పట్లో ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే జరిగింది భారీ అంచనాలతో విడుదలైన దమ్ము సినిమా ఫ్లాప్ అయ్యింది.. అప్పటికి వరస ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ కెరియర్ కు ఈ సినిమా మరింత దెబ్బ కొట్టింది. కుర్రహీరోలకు బోయపాటి శ్రీను హ్యాండిల్ చేయలేడు అని అపప్రధను కొనసాగిస్తూ మరోసారి అలాంటి డిజాస్టర్ ఇచ్చాడు. బాలకృష్ణ, రవితేజ లాంటి సీనియర్ హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు.. ఎన్టీఆర్, బెల్లంకొండ శ్రీనివాస్, రామ్ చరణ్ లాంటి హీరోలకు మాత్రం కలలో కూడా గుర్తొచ్చే ఫ్లాప్ సినిమాలు ఇచ్చాడు. బన్నీ మాత్రం ఎలాగోలా తప్పించుకున్నాడు. ఏదేమైనా అప్పుడు ఎన్టీఆర్ ఎలా అయిపోయాడో ఇప్పుడు కూడా అలాగే బలైపోయాడు.

More Related Stories