English   

జెర్సీ టీజ‌ర్‌ : ఆపేస్తేనే ఓటమి...ప్రయత్నిస్తే కాదట !

Nani-Jersey
2019-01-12 10:26:42

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, 'మ‌ళ్లీ రావా' ఫేం గౌత‌మ్ తిన్న‌నూరి కాంబినేష‌న్‌ లో క్రికెట్ నేపధ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా జెర్సీ. ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ న్యూ ఇయ‌ర్ కానుక‌గా విడుద‌లై ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక సంక్రాంతి కానుకగా కొద్ది సేప‌టి క్రితం సినిమా టీజ‌ర్ విడుద‌ల చేశారు.

ఇందులో క్రికెట‌ర్‌ గా నాని అద‌ర‌గొట్టాడు. క్రికెట్ లో తాను అనుకున్న లక్ష్యం చేదించడానికి నాని పడిన కష్టం, నిరుత్సాహ పరిచే మాటలు, ఆ మాటలనే ఆయుధాలుగా చేసుకుని ఆయన అధిగమించిన తీరు, తాను అనుకున్న స్థాయికి చేరుకుని పొందిన ఆనందం ఈ టీజర్లో చూపించారు. కథ అంతా కూడా క్రికెట్ నేపథ్యంలోనే కొనసాగుతుందనే విషయం ఈ టీజర్ వలన అర్థమవుతోంది. ‘ఆపేసి ఓడిపోయినవాడున్నాడు కానీ.. ప్రయత్నించి ఓడిపోయిన వాడు లేడు’ అంటూ నాని చెప్పే డైలాగ్ టీజర్ కే హైలైట్. శ్రద్ధా శ్రీ నాథ్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడిక్ స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ పాత్రలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం నాని క్రికెట్లో శిక్షణ కూడా తీసుకున్నాడ‌ట.  చూద్దాం దేవదాస్ మూవీ తర్వాత అర్జున్ గా నాని ఏం మ్యాజిక్ చేస్తాడో !

More Related Stories