English   

రష్మి రాసలీలలు త్వరలో బయటకు వస్తాయట !

Anchor-Rashmi
2019-01-12 19:29:17

సోషల్‌ మీడియాలో రష్మి రాసలీలల విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ రాసలీలల యవ్వారం ఏమిటా అనుకుంటున్నారా ? అయితే చదవండి. జబర్దస్త్‌లో హాట్‌ యాంకర్‌గా చాలా పాపులర్‌ అయిన రష్మి గౌతం ఆ తరువాత పలు చిత్రాల్లో హీరోయిన్‌ గా కూడా నటించింది. ఎంత బిజీ గా ఉన్నా కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులని అలరిస్తోంది. బయట అభిమానులతో ఎలా ఉంటుందో ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ మంచి పేరు తెచ్చుకుంటోంది. అలాంటి రష్మికి షాకిస్తూ సాయి ప్రణీత్‌ చౌదరి అనే ఓ నెటిజన్‌ షాకింగ్‌ పోస్ట్‌ పెట్టాడు. త్వరలో రష్మి రాసలీలలను లీక్‌ చేస్తాను, ఆమె బండారం అంతా బయట పెడతానంటూ పోస్ట్‌ చేశాడు. దాంతో ఈ విషయంపై చాలా సిల్లీగా స్పందించిన రష్మి నీ దగ్గర ఏ వీడియోలు ఉంటే అవి పెట్టేయ్‌, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను దేనికీ భయపడను, నేనే ధైర్యంగా పోస్ట్‌ చేయ్‌ అని అడుగుతున్నా కదా, నీ దగ్గర ఉన్న వీడియోలను ధైర్యంగా పోస్ట్‌ చేసెయ్‌ అంటూ సదరు వ్యక్తికి షాకింగ్‌ రిప్లై ఇచ్చింది. రష్మి వ్యాఖ్యలకు షాక్ గురవుతున్నారు. అంటే సదరు నెటిజన్‌ చేసిన పోస్ట్‌ను రష్మి చాలా లైట్‌గా తీసుకుందన్న మాట. 

More Related Stories