English   

క్రిష్ సినిమాలో వైఎస్...వర్మ సినిమాలో చంద్రబాబు !

ram gopal varma shared chandrababus first look from lakshmis ntr
2019-01-12 22:36:22

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదాల కేరాఫ్ అడ్రెస్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీ పార్వతి కోణంలో తీస్తున్నానని ముందే ప్రకటించిన వర్మ నిజాలు చెబుతా చెబుతా అని ఊదరకొడుతుండడంతో ఈ సినిమా పై భారిగా అంచానాలు నెలకొన్నాయి. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్‌ లో లక్ష్మీ పార్వతి ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ దానితో పాటు వర్మ మరో పాత్రకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. సినిమాలో ఈ పాత్ర ఎవరిదో తెలుసా అంటూ ప్రేక్షకులకి ప్రశ్న వేశారు. ఆ పాత్ర ఎవరిదో ఈజేగా అర్ధమయ్యేలా ఉంది. ఆ పాత్ర ఎవరిదంటే ఎన్టీఆర్ అల్లుడు, వెన్నుపోటు దారుడు అంటూ విమర్శలు ఎదోర్కుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విదుదల చేసిన 'వెన్నుపోటు' అంటూ సాంగ్ రిలీజ్ చేసి వివాదానికి కారణం అయిన వర్మ. తాజాగా ఫస్ట్ లుక్ తో సినిమాపై మరింత హైప్ పెంచి ఏపీలో రాజకీయ హీట్ పెంచేశారు. తన సినిమాలో ఈ పాత్ర అత్యంత కీలకమైందని చెబుతూ సదరు పాత్ర తాలూకు పలు రకాల ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న ఫోటోలను ట్విటర్ లో షేర్ చేస్తూ.. ‘ఈ ఫొటోలోని వ్యక్తి కళ్లలో ఏదో ఉంది’ అని కామెంట్ పెట్టారు. అయితే అది పాజిటివ్ గానా నెగటివ్ గానా అనేది అర్ధం కావట్లేదు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బాలయ్య-క్రిష్ కధానాయకుడు సినిమాలో వైఎస్ పాత్రను పోషించిన వ్యక్తి ఇక్కడ చంద్రబాబు క్యారెక్టర్ చేస్తుండడం. అయితే ఇదే వ్యక్తి ఘతంలో వర్మ తీసిన వంగవీటిలో దేవినేని నెహ్రూ క్యారెక్టర్ పోషించారు. ఆ నటుని పేరు శ్రీ తేజ్.

More Related Stories