English   

రెండు రకాల వేరియేషన్స్ తో చైతూ !

naga chaitanya samantha and shiva nirvan's film majili
2019-01-12 15:58:36

నాగ చైత‌న్య‌, స‌మంత పెళ్ళి త‌ర్వాత తొలిసారిగా నటిస్తున్న చిత్రం మ‌జిలి. ఏ మాయ చేశావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం చిత్రాల త‌ర్వాత స‌మంత‌, నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ నాలుగో సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. నిన్ను కోరి దర్శకుడు  శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ఈ సినిమాలో చైతూ, స‌మంత‌లు భార్య, భ‌ర్త‌లుగా క‌నిపించ‌నున్నారు. అయితే ఈ సినిమాలో చైతూ మాజీ క్రికెట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని, అలాగే సమంత రైల్వే క్లర్క్‌ పాత్రలో నటిస్తుంద‌ని ఆ మ‌ధ్య ప్రచారం జరిగింది. అది నిజమే అట, వీరిద్దరూ ప్రేమలో పడ్డాక పెళ్లి అవుతుందట, ఆ పెళ్లికి ముందు ఒక గెటప్ లో, అలాగే పెళ్లి తరువాత మరో గెటప్ లో చైతు కనిపిస్తాడని అంటున్నారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్యాభర్తల మధ్య నడిచే చాలా రొటీన్ కధ నేపథ్యంలో మ‌జిలి సినిమా ఉండబోతోందట. ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్‌ చేసి సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని టీమ్‌ నిర్ణయించుకుందట. హిందీ నటి దివ్యంశ కౌశిక్, సుబ్బరాజులు కీలక పాత్రలో నటించనున్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఇటీవలే విడుద‌ల కాగా, అది ప్రేక్షకులని ఎంత‌గానో ఆకట్టుకుంది. మరి విడుదల డేట్ ఎప్పటికి ఇస్తారో వేచి చూడాలి.

More Related Stories