English   

ఆ సినిమాలో మాధవన్ నటించట్లేదట !

Madhavan respond about movie with anushka shetty
2019-01-12 16:18:51

ఒక‌ప్పుడు హీరోగా అల‌రించిన మాధ‌వ‌న్ ప్ర‌స్తుతం తమిళ, తెలుగు బాషలలో కధలో మంచి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ మాత్రమె చేస్తూ వస్తున్నాడు. ఇటీవ‌ల చైతూ హీరోగా వచ్చిన స‌వ్య‌సాచి అనే సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అల‌రించాడు. ప్ర‌స్తుతం రాకెట్రీ అనే చిత్రం చేస్తున్నాడు. అయితే రెండ్రోజులుగా రోజులుగా అనుష్క హీరోయిన్ గా చేయ‌బోతున్న ఓ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ లో మాధ‌వ‌న్ ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీని పై తాజాగా మాధ‌వ‌న్ త‌న ట్విట్ట‌ర్ వేదికగా స్పందించాడు. తను ఒక సినిమాలో కీ రోల్ చేస్తున్న‌ట్టు వ‌స్తున్న‌వార్త‌లు అవాస్త‌వమని, ప్ర‌స్తుతం ఏ సినిమాలో కీ రోల్స్ చేయ‌డం లేదని ట్వీట్ చేశాడు. దీంతో మాధ‌వ‌న్ ఇచిన క్లారిటీతో అనుష్క సినిమాలో మాధ‌వ‌న్ న‌టించ‌డం లేద‌ని స్పష్టమైంది. దీంతో ఇంత వరకూ జరిగిన ప్రచారానికి తెరపడ్డట్టు అయింది. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో మైఖేల్ మాడ్సన్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి దీని మీద ఎవరు క్లారిటీ ఇస్తారో ?

More Related Stories