English   

వినయ విధేయ రామ లో ఆ సీన్ తీసేశారు !

Ram-charan
2019-01-13 13:33:48

మెగా వారసుడు రామ్‌చ‌ర‌ణ్‌ నటించిన `విన‌య విధేయ రామ‌` సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా ఇటీవ‌ల‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి రూపొందించిన ఈ సినిమాలో కొన్ని సీన్స్ అసలు సహజత్వానికి ఆమడ దూరంలో ఉన్న సీన్స్ కొన్ని ఉన్నాయి. గతంలో బాలయ్య పల్నాటి బ్రహ్మనాయుడు లో తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, చిటికేస్తే కుర్చీ పాక్కుంటూ వచ్చేయడం లాంటి సన్నివేశాలను ఇప్పటి వరకు గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటారు. అలాంటి సన్నివేశాలే గుర్తు తెచ్చేలా బాలయ్య రికార్డులను దర్శకుడు బోయపాటి 'వినయ విధేయ రామ' సినిమాతో బద్దలు కొట్టేశాడని రెండ్రోజుల నుండీ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్న సంగతి తెల్సిందే. ఒక ఫైట్ లో రామ్ చరణ్ విలన్ తమ్ముడు, మరో విలన్ గ్యాంగ్ సభ్యుడి తలలు నరికితే అవి గాల్లోకి ఎగరడం, వాటిని గద్దలు ఎత్తుకుపోవడం, వేగంగా వెళ్తోన్న ట్రైన్ పై చరణ్ వంతెన మీద నుండి దూకి నిలబడి వైజాగ్ నుండి నేపాల్ బోర్డర్ కు వెళ్ళడం రియాలిటీకి చాలా దూరంగా ఉండడంతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నేటి నుండి థియేటర్ లలో ఈ సీన్ కనిపించదు, విపరీతమైన ట్రోలింగ్స్ రావడంతో ఈ సీన్‌ను చిత్ర‌బృందం సినిమా నుంచి తొలగించింది.

More Related Stories