English   

పేట తెలుగులో వ‌ర్క‌వుట్ అవుతుందా.. క‌లెక్ష‌న్ల మాటేంటి..? 

Rajinikanth-Peta
2019-01-13 14:41:32

పేటా వస్తుంది ఏ పేటలో చూసినా ఇదే సినిమా కనిపిస్తుంది.. జనవరి 18 నుంచి మా సినిమా తప్ప ఇంకో సినిమా థియేటర్లలో కనిపించదు. సరిగ్గా పది రోజుల కిందట నిర్మాత అశోక్ వల్లభనేని అన్న మాటలు ఇవి. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు అన్నీ వచ్చేశాయి. వీటిలో ఒక్క ఎఫ్ 2 సినిమా తప్ప ఏది హిట్ అయ్యేలా కనిపించడం లేదు. కథానాయకుడు సినిమా బాగున్నా కూడా కలెక్షన్లు రావడం లేదు. మరోవైపు రామ్ చరణ్ సినిమా కనీసం వచ్చినట్లు కూడా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. వీటి మధ్యలో వచ్చిన రజినీకాంత్ పేట ఇప్పుడు కలెక్షన్ల వేటలో కాస్త ముందు ఉందని తెలుస్తుంది. తొలి రెండు రోజులు నామ‌మాత్ర‌పు వ‌సూళ్లు తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు దూసుకుపోతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక్క‌డ ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడానికి పూర్తి అవకాశం మన హీరోలు ఇచ్చారు. ముందు థియేటర్లు లేవు అంటూ వ‌ద్ద‌నుకున్న సినిమానే ఇప్పుడు కోరి థియేటర్లు ఇస్తున్నట్టు తెలుస్తోంది. 

రజనీకాంత్ అభిమానులకు పేట కన్నుల పండుగే. కొన్నేళ్లుగా అభిమానులు రజనీకాంత్ ను ఎలా చూడాలనుకుంటున్నారో లెక్కలు వేసుకుని మరీ కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా తెరకెక్కించాడు. దాంతో ఆయన్ని కూడా నెత్తిన పెట్టుకున్నారు సూపర్ స్టార్ అభిమానులు. ఇప్పుడు తమిళనాట పేటకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మూడు రోజుల్లో అక్కడ 49 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. అయితే కేవలం తమిళనాట మాత్రం 24 కోట్లతో సరిపెట్టుకుంది పేట. అక్కడ అజిత్ సినిమా కూడా పోటీలో ఉండటంతో రజినీకాంత్ కాస్త వెనక్కి తగ్గాడు. తమిళనాడులో మాత్రమే చూసుకుంటే పేట‌ కంటే అజిత్ విశ్వాసం ముందుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం రజనీకాంత్ ముందున్నాడు. చాలా రోజుల తర్వాత ఆయన కోరుకున్న కమర్షియల్ హిట్ పేట సినిమాతో వచ్చింది.

More Related Stories