English   

విన‌య విధేయ రామను చిరంజీవి ప‌ట్టించుకోలేదా..?

Chiranjeevi
2019-01-13 15:43:23

రామ్ చరణ్ ఒక సినిమా చేశారు అంటే కచ్చితంగా చిరంజీవి హస్తం కూడా అందులో ఉంటుంది. ఆయన కథ విని ఓకే అన్న తర్వాత కానీ ఆ సినిమా పట్టాలెక్క‌దు. ఇప్పటివరకు చరణ్ కెరియర్ లో చేసిన ప్రతి సినిమా కూడా చిరంజీవి బ్యాక్ బోన్ గా ఉన్నాడు. తనయుడు కోసం ప్రత్యేకంగా కథలు వినడం.. దర్శకులను సిద్ధం చేయడం మెగాస్టార్ చేసే పని. రాజ‌కీయాల్లో ఉన్న‌పుడు ఇది ఇంకాఎక్కువ‌గా ఉండేది.  ప్రస్తుతం ఈయన సినిమాలతో బిజీగా ఉండటంతో కాస్త చరణ్ సినిమాల నుంచి దృష్టి ప‌క్క‌కు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు మెగా వారసుడి కొంపముంచింది. బోయపాటి శ్రీనుతో ఈయన చేసిన విన‌య విధేయ రామ‌ సినిమా చూసిన తర్వాత అసలు రామ్ చరణ్ కు కథల ఎంపికలో కాస్త క్లారిటీ ఉందా అని విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే రంగస్థలం పూర్తిగా రామ్ చరణ్ తన ఇష్టంతో చేసిన సినిమా.. ఇది బ్లాక్ బస్టర్ అయింది. 

అదే నమ్మకంతో బోయపాటి శ్రీను తో కూడా సినిమా చేశాడు రామ్ చరణ్. త‌న‌యుడి కథలు ఎంపికపై నమ్మకంగా ఉన్న చిరంజీవి బోయపాటి సినిమా విషయంలో పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. సినిమా పూర్తయిన తర్వాత కూడా చిరంజీవికి చూపించారా లేదా అనే అనుమానాలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. ఒకవేళ చూపించి ఉంటే కచ్చితంగా ఆయన రియాక్షన్ కూడా మరోలా ఉండేది. ఆయన ప్రస్తుతం సైరాతో పాటు ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల బోయపాటి సినిమా నేరుగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దాని ఫలితం ఎలా ఉంది ప్రేక్షకులకు తెలుస్తుంది. మొత్తానికి చిరంజీవి చూసి ఓకే అన్న తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి కానీ మన విన‌య విధేయ రామ స్థాయిలో మాత్రం ఏ సినిమా డిజాస్టర్ కాలేదు.

More Related Stories