English   

ఏం మాయ చేస్తున్నావ్ స‌మంత ఇంత‌కీ..? 

Samantha
2019-01-13 09:59:33

పెళ్లి తర్వాత కూడా సినిమాలతో బిజీగా ఉంటుంది సమంత. సాధారణంగా పెళ్లి అయితే మన హీరోయిన్లను పట్టించుకోవడం మానేస్తారు దర్శక నిర్మాతలు. కానీ సమంత విషయంలో మాత్రం అది జరగడం లేదు. ఈ భామ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే ఉంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. భర్త నాగచైతన్య సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకుంది. అక్కినేని జంట ఇద్దరూ ఇప్పుడు ఫారెన్ ట్రిప్ లో ఉన్నారు. పండగ తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ కానున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం మ‌జిలి సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు. ఈ చిత్రం తర్వాత మరో మూడు సినిమాలు సమంతా కోసం వేచి చూస్తున్నాయి. నందినీరెడ్డి దర్శకత్వంలో నటించబోయే మిస్ గ్రానీ సినిమా రీమేక్ మార్చి నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఎంత సక్కగున్నావే అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు నాని నిర్మాతగా విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో సమంత ఓ చిత్రం చేయబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. మొత్తానికి పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ మిగిలిన హీరోయిన్లకు సమాధానం లేని ప్రశ్నగా మారిపోతుంది సమంత.

More Related Stories