English   

క‌థానాయ‌కుడు ఎందుకు క‌లెక్ష‌న్లు తీసుకురావ‌డం లేదు..

NTR-kathanayakudu
2019-01-13 17:20:14

ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్ లలో ఎలాంటి పెరుగుదల లేకపోవడం చిత్రయూనిట్ ను కంగారుపెడుతోంది. ఎంతగా ప్రమోషన్ చేస్తున్నా కూడా అవి కలెక్షన్లలో కనిపించడం లేదు. ఎన్టీఆర్ జీవితం అంటే కచ్చితంగా సంచలన విజయం సాధిస్తుందని ముందు నుంచి నమ్మకంగా ఉన్న బాలకృష్ణకు ఇప్పుడు ఇది న‌మ్మ‌డ‌మే కష్టంగా మారింది. ఎందుకో తెలియదు కానీ కథానాయకుడు సినిమాకు తొలి రోజు నుంచే ఊహించిన వసూళ్ళు రాలేదు. ఇప్పటివరకు నాలుగు రోజుల్లో కేవలం 14 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్లు వస్తే కానీ సేఫ్ అనిపించుకోలేదు కథానాయకుడు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా 72 కోట్లు రావాలి. ఇలాంటి సమయంలో కథానాయకుడికి వస్తున్న కలెక్షన్లు చూసి చిత్ర యూనిట్తో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా కంగారు పడుతున్నారు. 

గత రెండు సంక్రాంతులకు రెండు విజయాలు అందుకున్న బాలకృష్ణకు ఈసారి మాత్రం అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కథానాయకుడు కమర్షియల్గా నిరాశ పరచడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 72 కోట్లు రావడం అనేది క‌లే. రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా దాన్ని క్యాష్ చేసుకోవడంలో విఫలమవుతున్నాడు ఎన్టీఆర్ కథానాయకుడు. సినిమాలో ఎమోషన్ లేదని ఎన్టీఆర్ దేవుడు అని చెప్పడానికి మాత్రమే తీసినట్లు ఉందని విమర్శిస్తున్నారు విశ్లేషకులు. ఇదే సినిమాకు మైనస్ గా మారింది. మహానటిలో కథతో పాటు ఎమోషన్ కూడా ఉంది.. కానీ ఎన్టీఆర్ లో అది మిస్ అయ్యే సరికి ప్రేక్షకులు కాస్త ఫీలవుతున్నారు.
 

More Related Stories