English   

అనుష్కకి గిల్లించుకోవాలని ఉంటె...గిల్లుతా !

Old video of Ranveer asking Anushka if she wants her a pinched goes viral
2019-01-13 11:49:08

కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు గానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమని పెద్దలు అంటూ ఉంటారు. నిజమే మరి ఎప్పుడో ఏడెనిమిదేళ్ళ క్రితం చేసిన నోటి దురద వ్యాఖ్యలు దుమారమై నటుడు రణ్ వీర్ సింగ్ కి గుచ్చుకుంటున్నాయి. అప్పట్లో అనుష్క శర్మ మీద రణ్ వీర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అంత నీచంగా అనుష్క పై చేసిన వ్యాఖ్యల పట్ల నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్లు. 2011లో హీరోయిన్ అనుష్కశర్మతో కలిసి కాఫీ విత్ కరణ్‌ షోలో పాల్గొన్న రణ్‌ వీర్‌ కొన్ని అప్పట్లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కానీ అప్పట్లో సోషల్‌ మీడియా ఉన్నా ఇంత యాక్టివ్ గా లేకపోవడంతో బతికిపోయిన రణ్‌వీర్‌, ఇప్పుడు ఎవరు వెలికి తీశారో తెలీదు కానీ, అప్పటి క్లిప్స్ పట్టుకుని ఆడుకుంటున్నారు నెటిజన్లు. అప్పట్లో కరీనా కపూర్ పూల్ ఈత కొట్టడం చూస్తుంటే, చిన్న వయసులోనే ఉన్న తనకు మూడ్‌ వచ్చేదని ఇక అనుష్కకు గిల్లించుకోవాలని ఉంటే గిల్లుతానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇప్పుడు నెటిజన్ల ట్రోలింగ్ కు బెంబేలు ఎత్తుతున్నాడు. 

More Related Stories