English   

ఎందుకు బోయ‌పాటి గారు ఇలా చేసారు..? 

Vinaya-Vidheya-Rama
2019-01-13 11:52:41

బాబు రెడీ.. కెమెరా రెడి.. యాక్షన్ అంటూ తన సినిమాను మొదలు పెడతాడు బోయపాటి శ్రీను. కాకపోతే ప్రతి సినిమాలోనూ యాక్షన్ మోతాదుకు మించి ఉంటుంది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో అది ఆకాశమంత ఎత్తుకు చేరింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్స్ పెరిగిపోయాయి. బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ‌ మూడు రోజులకు కలిపి కేవలం 33 కోట్లు మాత్రమే వసూలు వ‌చ్చాయి. అందులో తొలిరోజు 26 కోట్లు వసూలు చేయడం విశేషం. ఆ తర్వాత రెండు రోజుల్లో దారుణంగా పడిపోయింది ఈ చిత్రం. కలెక్షన్ల వేటలో రామ్ చరణ్ సినిమా పండగను ఇంత కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. అసలు ఈ సినిమాను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. ఎందుకంటే అంత దారుణంగా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మ‌రి. 

ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ సినిమాకు కథ సిద్ధం చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో బోయపాటి సినిమా ఉండబోతుంది అని ప్రచారం ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇది తెలుసుకున్న అభిమానులు కంగారు పడుతున్నారు. బోయపాటితో సినిమా చేయొద్దు అంటూ సూపర్ స్టార్ కు ముందు నుంచే స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు ఆయ‌న అభిమానులు. ఆయనకు సినిమా అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు రామ్ చరణ్ ను చూస్తే అర్థమవుతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఒక్క సినిమాతో ఉన్న ఇమేజ్ మొత్తం పోగొట్టుకొని మళ్ళీ సున్నా నుంచి మొదలు పెడుతున్నాడు బోయపాటి శ్రీను. మరి బాలకృష్ణ సినిమాతో ఈయ‌న‌ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.

More Related Stories