English   

మణికర్ణిక చరిత్రను వక్రీకరించారు...క్రిష్ కామెంట్స్ !

Director Krish strong comments on Manikarnika movie
2019-01-13 12:02:25

తెలుగు ప్రజలంతా అన్నా అని ముద్దుగా పిలుచుకునే మాజీ సీఎం నంద‌మూరి తార‌క రామారావు జీవిత‌కథ ఆధారంగా `ఎన్టీయార్‌` బ‌యోపిక్ ని రెండు భాగాలుగా క్రిష్ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆఫర్ రాగానే ఆయన దర్శకత్వం వహిస్తున్న మణికర్ణిక సినిమాని మధ్యలోనే వదిలేసి వచ్చాడని, ఆయన వలన సినిమా ఆగకూడదు అని హీరోయిన్ గా ఉన్న కంగనా సినిమా దర్శకత్వ బాద్యతలు తలకెత్తుకుని సినిమా పూర్తి చేసిందని ప్రచారం జరిగింది. దానికి ఊతం ఇస్తూ దర్శకుడి పేరు దగ్గర క్రిష్, కంగనా ఇద్దరి పేర్లూ ఉన్నాయి. అయితే తాజాగా విడుదలయిన క‌థానాయ‌కుడు ప్ర‌మోష‌న్ కోసం ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్రిష్ ని ఈ విషయం గురించి అడగగా ఆయన స్పందించారు.  తాను మణికర్ణిక చ్నిమా కోసం 109 రోజులు పనిచేసిన తరువాత, అనుకోకుండా 'ఎన్టీఆర్' సినిమా ఆఫర్ వచ్చిందని, దానికోసం తాను హైదరాబాద్ వచ్చి, రెండు వారాల్లో 'మణికర్ణిక' మిగతా ప్యాచ్ వర్క్ అంతా పూర్తి చేయాలని అనుకున్నానని అన్నాడు. కానీ తాను వచ్చేసిన తరువాత సినిమాలో రకరకాల మార్పులు జరిగాయని, సోనూసూద్ ను తీసేశారని, ఆయన మీద తీసిన సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించారని, కథను తప్పుదారి పట్టించి, చరిత్రను వక్రీకరించారని ప్రకటించి క్రిష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తానూ వచ్చేశాక సినిమా రిలీజ్ డేట్ మారిందని, ఆ తర్వాత సినిమా చేతులు మారిందని ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల మార్పులు జ‌రిగాయని చెప్పుకొచ్చాడు. తాను వివాదాల్లోకి వెళ్లదలచుకోలేదని, కానీ సోనూసూద్ ని తొలగించి పెద్ద వాళ్ళు తప్పు చేశారని అన్నాడు. అయితే సినిమా టీమ్ తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పిన క్రిష్, అది నా సినిమానే అని చెప్పడం గమనార్హం.

More Related Stories