English   

య‌శ్ ను క‌న్న‌డ‌నాట తొక్కేస్తున్నారా..?

kanada actor Yash did sensational comments
2019-01-13 12:27:20

య‌శ్ అంటే ఇంతకు ముందు తెలుగు ప్రేక్షకులకు తెలియదు.. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పేరు బాగానే తెలుస్తోంది.. దానికి కారణం కే జి ఎఫ్ సినిమా. నెలరోజుల కింద విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లో సంచలన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల వసూలు చేసి య‌శ్ మార్కెట్ ఏంటో.. కన్నడ సినిమా సత్తా ఏంటో చూపించింది. ఇప్పుడు ఈ చిత్ర హీరో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. కర్ణాటకలో కొంతమంది కావాలనే తనపై కక్ష కట్టారని.. ఐటీ దాడులు.. మిగిలినవి అంటూ ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. త‌నిమేజ్ డ్యామేజ్ చేయ‌డానికి కొంద‌రు ప్రయత్నిస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు య‌శ్. ఈమధ్య ఇంటిపై ఐటి దాడులు జరిగాయి.. అక్రమంగా ఆస్తులు ఉన్నాయి అంటూ కేసు కూడా పెట్టారు. బ్యాంకు నుంచి 40 కోట్లు రుణం తీసుకున్న అంటూ వార్తలు వస్తున్నాయి.
దీనిపై స్పందించిన య‌శ్.. తాను ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదని కావాలని కావాలనే ఇలా ఉన్న‌ది లేనిది చెబుతున్నారంటూ వాపోతున్నాడు. లేనిపోనివి చెప్పి తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారు అంటున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్ట‌ర్ 2తో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఈ సినిమా తర్వాత తెలుగులో రాజమౌళి సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు అనే ప్రచారం జరిగినా కూడా అందులో ఎలాంటి నిజం లేదని తేల్చేశాడు య‌శ్. ప్ర‌స్తుతం కన్నడ సినిమాలతో బిజీగా ఉన్నానని ఇప్పుడు తెలుగులో విలన్గా నటించే అవకాశమే లేదని తేల్చేశాడు ఈ హీరో. మొత్తానికి ఒకరు ఎదుగుతుంటే చూడలేని మనస్తత్వం సినిమా ఇండస్ట్రీలో ఉంద‌ని మరోసారి అర్థమైపోతుంది.

More Related Stories