English   

అలా కంచరపాలెంకి ఊరట లభించింది !

Line Clear for C/O Kancharapalem Movie
2019-01-13 12:35:33

సినిమా విడుదలకి మందే న్యూ యార్క్ ఫిలిం ఫెస్టివల్ లాంటి ప్రఖ్యాత ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికయిన కేరాఫ్ కంచరపాలెం. తాజాగా నిర్మాత భారత మూలాలున్న వ్యక్తే కానీ భారత్ వ్యక్తి కాదన్న కారణం చూపి ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాను జాతీయ అవార్డులకు పరిగణనలోకి తీసుకోకపోవడం కొద్ది రోజుల నుండి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీని మీద పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తోంది. ఈ చిత్ర నిర్మాత పరుచూరి ప్రవీణ స్వతహాగా భారతీయురాలే, కానీ ఆమె తల్లితండ్రుల తరం నుండి అమెరికాలో స్థిరపడ్డారు. అయినా తెలుగు సినిమా మీద మక్కువతో ఆమె అక్కడి నుంచి వచ్చి ఇక్కడి నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమాను నిర్మించింది. కానీ అవన్నీ పట్టించుకోకుండా నిర్మాత ఎన్నారై అనే ఒక్క కారణం చూపి జాతీయ అవార్డులకు దరఖాస్తును తిరస్కరించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే చేసారు సినీ ప్రేమికులు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ ఈ విషయం తెలుసుకుని కేంద్ర మంత్రి రాజ్ వర్ధన్ సింగ్ రాథోడ్ తో స్వయంగా మాట్లాడగా, ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సినిమాను కూడా పరిగణనలోకి తీసుకునేందుకు అధికారులు అంగీకరించారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నిర్మాత ప్రవీణ, తమకు సహకరించిన కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిబంధనను శాశ్వతంగా తొలగించేలా చూడాలని ఆయన కోరారు.

More Related Stories