English   

నో కౌశల్...నూతన్ నాయుడు వచ్చాడు కానీ !

nutan naidu play role in Venkatesh and Varun Tej F2 Movie
2019-01-13 12:51:37

కామన్ మాన్ గా బిగ్ బాస్‌ 2 సీజన్ లో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన నూతన్ నాయుడు నిన్న రిలీజ్ అయిన ఎఫ్2 లో ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్య పరిచాడు. సినిమాలో చాంతాడంత తారాగణాన్ని క్యాస్టింగ్ చేసిన అనిల్ రావిపూడి క్రేజ్ వాడుకుందాం అనుకున్నాడో లేక క్రేజ్ వచ్చేలా చేద్దాం అనుకున్నాడో కానీ నూతన్ నాయుడుని సినిమాలో భాగం చేశాడు. క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ కు అసిస్టెంట్ గా ఓ పాత్రను సృష్టించాడు. అయితే అసలు నూతన్ ఉన్న సీన్లు అసలు రక్తి కట్టించాకపోగా అసలు అనవసరంగా ఈ సీన్లు ఎందుకా అనిపిస్తాయి. నూతన్ నాయుడుకి పెద్దగా డైలాగ్స్ లేకపోగా ఉన్న కొన్ని డైలాగ్స్ కూడా నటనలో భాగంగా కాకుండా ఏదో బట్టిపట్టి అప్పజెప్పినట్టు చేసాడు.  ఒకరకంగా క్లైమాక్స్ కి నూతన్  మైనస్, కానీ అతని తింగరి తనం వల్లే క్లైమాక్స్ వచ్చేలా ఏర్పాటు చేశాడు దర్శకుడు. ఇదిలా ఉంటె టైటిల్ గెలుచుకున్న కౌశల్ కి చాలా సినిమా ఆఫర్లు వచ్చాయని, బోయపాటి రాం చరణ్ సినిమాలో నటించడానికి చాన్స్ కూడా వచ్చిందని ప్రహ్కారం జరిగింది. అయితే ఆ సినిమాలో ఎక్కడా కౌశల్ కనపడకపోయినా నూతన్ నాయుడు తెర మీద కనువిందు చేశాడు.

More Related Stories