English   

ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, మ‌హేశ్ బాబు.. 

Pawan-Mahesh
2019-01-14 06:25:14

హీరోలు ఏంచేస్తే అభిమానులు కూడా అదే చేస్తుంటారు. అందుకే సినిమాల్లో ఎలా ఉంటారో బయట కూడా హీరోలు అంతే మంచిగా ఉండాలి. అప్పుడే అభిమానులు కూడా వాళ్లను చూసి ఇంకా నేర్చుకుంటారు. కానీ నిజంగా మన హీరోలు అలా ఉన్నారా దీనికి సమాధానం మాత్రం కాదు అని వస్తుంది. మన హీరోలు సినిమాల్లో మాత్రమే హీరోలు. బయట వాళ్ళు ఉండే తీరు అభిమానులకు పెద్దగా నచ్చడం లేదు. ఇప్పుడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఫైన్లు కడుతుంటే అభిమానులు వాళ్లను ఫాలో కాకుండా ఏం చేస్తారు మరి. 

తాజాగా మహేష్ బాబు కారుకు ఏడుసార్లు సార్లు ఓవర్ స్పీడ్ కారణంగా ఫైన్ వేసారు ట్రాఫిక్ పోలీసులు. 2016 నుంచి 2018 మధ్యలో ఈ కారుపై ఏకంగా ఏడుసార్లు ట్రాఫిక్ చలాన్ వేశారు పోలీసులు. ఈ మధ్యే మహేష్ బాబు దీన్ని చెల్లించారు కూడా. మహేష్ ఒక్కడే కాదు పవన్ కళ్యాణ్ కార్ మీద కూడా ఇలాంటి ట్రాఫిక్ చలాన్ లు ఉన్నాయి. ఈయన మూడుసార్లు రాంగ్ పార్కింగ్ లో కార్ పెట్టి ఫైన్ వేయించుకున్నాడు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా మారిపోయారు. సెలబ్రెటీలు అయినా కూడా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. రూల్స్ పాటించకపోతే అందరినీ ఒకే తాటిన కట్టేస్తున్నారు. దాంతో మన హీరోలకు కూడా తిప్ప‌లు తప్పడం లేదు. ఆ మధ్య నితిన్, బాలకృష్ణ కార్లు కూడా ఇలా ట్రాఫిక్ చలాన్ ల బారిన పడ్డాయి. 

More Related Stories