English   

పిల్లల మీద ఒట్టు : ప్రభాస్‌ గురించి షర్మిల కామెంట్స్ !

YS-Sharmila
2019-01-14 08:47:54

కొన్నాళ్ళ క్రితం సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ప్రభాస్-షర్మిలల సంబంధం వివాదం మళ్ళీ తెరమీదకి వచ్చింది. ఈ ప్రచారం మీద షర్మిల తొలి సారిగా నోరు విప్పారు. సోషల్‌ మీడియాలో తన మీద, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారి పై చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేసిన వైఎస్‌ షర్మిల ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాల మీద స్పందించారు. ఈ రోజు భర్త అనిల్‌ కుమార్‌తో కలిసి కమిషనర్‌ కార్యాలయానికి వెళ్ళిన షర్మిల మాట్లాడుతూ ప్రభాస్‌ తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ అసత్య ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు. 

2014 ఎన్నికలకు ముందు తనకు, ప్రభాస్‌తో సంబంధం ఉందని అసత్య ప్రచారం చేశారని అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే అప్పుడు ప్రచారం ఆగిందని ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చాక తన మీద మరోసారి అసత్య ప్రచారాలు మొదలుపెట్టారని పేర్కొన్నారు. దీని వెనకాల ఎవరున్నా సరే వారిపై చర్యలు తీసుకోవాని హైదరాబాద్ సీపీని కోరినట్లు ఆమె తెలిపారు. అలాగే ప్రభాస్ అనే వ్యక్తికీ తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ వ్యక్తిని జీవితంలో ఎప్పుడూ కలవలేదని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పారు. ప్రభాస్ అనే వ్యక్తికి తనకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు రుజువు చేయగలరా? అని సవాల్ విసిరారు. ఈ ప్రచారాల వెనక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నానని, తన మీద వస్తున్న ఆరోపణలకి తెలుగుదేశం స్పందించక పోవడం దీనికి ఊతం ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. 

ఇది తన ఒక్కదాని గురించే కాదని ఆడవాళ్ల మీద జరుగుతున్న దుష్ప్రచారాలన్నిటి మీదా ఫిర్యాదు చేశానన్నారు. వెబ్ సైట్, సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎవరు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సీపీని కోరారు. ఒక తల్లి గా చెల్లి గా నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కానీ గౌరవం కాపాడుకోవాలని బయటకు వచ్చి ఫిర్యాదు చేశానని పేర్కోన్నారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా? వారి మీద మేము దుష్ప్రచారం చేయలేమా? మాకు తెలివి లేదా? కనీ మాకు విలువలు ఉన్నాయి కాబట్టే అలాంటి పనులు చేయడం లేదని షర్మిల పేర్కొన్నారు.  నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నా జీవితంలో ప్రభాస్ అనే వ్యక్తిని ఎప్పుడూ కలవలేదని షర్మిల అన్నారు. 
 

More Related Stories