English   

బాలయ్య రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తున్నాడట !

Balakrishna
2019-01-14 16:24:30

ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న సోషల్ మీడియా టాపిక్స్ లో రిటర్న్ గిఫ్ట్ ఒకటి, ఏ ముహూర్తాన చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నాడో తెలీదు కానీ అది ట్రేండింగ్ లోకి వెళ్ళిపోయింది. అయితే తాజాగా చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ఒకరికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్దమయిపోయాడు. ఆ మధ్య బాలకృష్ణ హీరోగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక అతిధి పాత్రను పోషించారు. అయితే ఇప్పుడు ఆయన హీరోగా ఆయన 125వ సినిమాగా 'భైరతి రణగళ్' తెరకెక్కుతోంది. ఈ సినిమాకి దర్శక నిర్మాతగా మఫ్టీ సినిమాని తెరకెక్కించిన నార్తన్ వ్యవహరిస్తున్నాడు. ఇది మైలు రాయి లాంటి సినిమా కావడంతో ఈ సినిమా మీద శివరాజ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఈ సినిమాలోని ఒక కీలకమైన అతిథిపాత్ర ఉండటంతో ఆ పాత్రను పోషించవలసిందిగా ఆయన బాలయ్యను కోరినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి శివరాజ్ కుమార్ కి, బాలకృష్ణకి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు 'భైరతి రణగళ్' సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించనున్నారన్న ప్రకటన రావడం లాంఛనమే.

More Related Stories