English   

సంక్రాంతికి అల్లుళ్ల‌కు తిరుగులేకుండా పోతుందిగా.. 

F2
2019-01-14 09:48:03

సంక్రాంతి అంటేనే అల్లుళ్ల పండ‌గ‌. ఆ పండ‌క్కి కొత్త‌ల్లుళ్లు ఇంటికి వ‌చ్చి నానాసంద‌డి చేస్తుంటారు. ఇప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చారు. పండగ సినిమాల్లో ఏది విజేతగా నిలవనుందో ఇప్పటికే ప్రేక్షకులకు అర్థం అయిపోయింది. పండగ సీజన్లో చివరి సినిమాగా వచ్చిన ఎఫ్ 2 ఇప్పుడు కలెక్షన్లు కుమ్మేస్తుంది. ముందునుంచి అనుకున్నట్లుగానే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. తొలిరోజు ఆరు కోట్లకు పైగా వసూలు చేసిన ఎఫ్2.. రెండో రోజు కూడా దాదాపు అయిదు కోట్లకి పైగా షేర్ వసూలు చేసే క్రమంలో ముందుకు దూసుకెళ్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా దూకుడు కొనసాగుతోంది. 

అక్కడ కేవలం రెండు రోజుల్లోనే ఏడు లక్షల డాలర్లు వసూలు చేసి వన్ మిలియన్ వైపు పరుగులు తీస్తుంది ఈ సినిమా. సాధార‌ణంగా అనిల్ రావిపూడి కి ఓవర్సీస్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ విజయం లేదు. కానీ ఇప్పుడు ఎఫ్2తో ఆ లోటు తీరుతుంది. ఈ సినిమా ఓవర్సీస్ లో సేఫ్ కావాలంటే 1.2 మిలియన్ రావాలి.. ఇప్పుడు ఈ చిత్ర‌ జోరు చూస్తుంటే ఏకంగా 1.5 మిలియన్ వైపు పరుగులు తీసేలా కనిపిస్తోంది. మొత్తానికి పండగ సినిమాల్లో చివరగా వచ్చిన కూడా ముందు మూడు సినిమాలు సాధించలేని విజయం సాధిస్తుంది ఎఫ్2. ఫుల్ రన్ లో ఈ చిత్రానికి ఈజీగా 40 కోట్ల వరకు వసూళ్లు చేసేలా కనిపిస్తున్నాయి. ఇదేగాని జరిగితే 2019 సంక్రాంతి విన్నర్ గా ఎఫ్2 నిలవడం ఖాయం.

More Related Stories