English   

పాపం విన‌య విధేయ రామ బ‌య్య‌ర్ల ప‌రిస్థితేంటి ఇప్పుడు..? 

Vinaya-Vidheya-Rama
2019-01-14 10:30:51

విన‌య విధేయ రామ కలెక్షన్లు చూస్తుంటే డిస్ట్రిబ్యూటర్లను ఏమని ఓదార్చలో కూడా అర్థం కావడం లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అత్యంత దారుణంగా బోల్తా కొట్టడం ఖాయం అయిపోయింది. తొలిరోజు 26 కోట్లకు పైగా వసూలు చేసిన విన‌య విధేయ‌ రామా రెండో రోజు వచ్చేసరికి కేవలం నాలుగు కోట్లతో సరిపెట్టుకుంది. ఇక మూడో రోజు ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూడు కోట్ల దగ్గరే ఈ చిత్రం ఆగిపోయింది. ఇప్పటివరకు మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్లు మాత్రమే వసూలు చేసింది విన‌య విధేయ రామ‌. కానీ ఈ సినిమా సేఫ్ కావాలంటే రావాల్సింది 95 కోట్లు. ఇప్పుడు ఎలాంటి అద్భుతాలు చేసినా కూడా కనీసం 40 కోట్లు కూడా దాటేలా కనిపించడం లేదు. దాంతో బయ్యర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

గతేడాది పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోకముందే అబ్బాయి వచ్చి మరో దెబ్బ కొట్టాడు అంటూ బ‌య్య‌ర్లు వాపోతున్నారు. ఈ చిత్రంతో దాదాపు 50 కోట్ల‌కు పైగానే న‌ష్ట‌పోనున్నారు డిస్ట్రిబ్యూట‌ర్లు. మ‌రి వీళ్ల‌ను ఎవరు ఆదుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది ఇప్పుడు. 95 కోట్లు బిజినెస్ చేసిన రామ్ చరణ్ సినిమా 40 కోట్లు వసూలు చేయలేక 50 కోట్లకు పైగా నష్టం తీసుకోవడానికి సిద్ధంగా ఉందిప్పుడు. బోయపాటి శ్రీనుకు కూడా తన కెరియర్లో ఎప్పుడూ చూడనటువంటి డిజాస్టర్ ఇది. దాంతో ఈయన కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాడు. సినిమా ఎక్క‌డ తేడా కొట్టిందబ్బా అంటూ లెక్క‌లేసుకుంటున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి చూడాలి విన‌య విధేయ రామ అరాచకాల నుంచి డిస్ట్రిబ్యూటర్లను ఎవరు కాపాడుతారో.

More Related Stories