English   

మ‌హేశ్ బాబుతో పోటీ ప‌డుతున్న నాగ‌చైత‌న్య‌.. 

Naga-Chaitanya
2019-01-14 10:49:44

ఏడాది కింది వ‌ర‌కు నాగ‌చైత‌న్య‌, స‌మంత క‌లిసి న‌టించినా కూడా క్రేజ్ ఉండేది కానీ మ‌రీ ఇంత క్రేజ్ అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్లు రీల్ లైఫ్ క‌పుల్ కాదు.. రియ‌ల్ లైఫ్ క‌పుల్. అందుకే నాగ‌చైత‌న్య, స‌మంత క‌లిసి సినిమా చేస్తున్నారంటే ఇంత ఆస‌క్తి.. ఇన్ని అంచ‌నాలు. వీళ్లిద్ద‌ర్ని పెళ్లి త‌ర్వాత క‌లిపి చూపించాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ట్రై చేసారు. కానీ మ‌న‌సును తాకే క‌థ వ‌చ్చేవ‌ర‌కు క‌చ్చితంగా క‌లిసి న‌టించం అని చెప్పాడు నాగ‌చైత‌న్య‌. అలాంటి క‌థ తీసుకురావ‌డానికి చాలా మంది ద‌ర్శ‌కులు ట్రై చేసినా చైతూను మాత్రం మెప్పించ‌లేక‌పోయారు. ఇప్పుడు నిన్నుకోరి ఫేం శివ‌నిర్వాన ఇది చేసాడు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నారు. ఏ మాయ చేసావే, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నం లాంటి సినిమాల త‌ర్వాత ఈ ఇద్ద‌రూ న‌టిస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ క్రేజీ కాంబినేష‌న్ ను త‌న క‌థ‌తో మ‌రింత క్రేజీగా మార్చేస్తున్నారు ద‌ర్శ‌కుడు శివనిర్వాన‌. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ 80 శాతం పూర్త‌యింది. 

తాజాగా సంక్రాంతి కానుక‌గా రెండో లుక్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాతలు. ఇందులో క్రికెట్ బ్యాట్ ప‌ట్టుకుని రెండో హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ తో ఉన్నాడు చైతూ. త‌ణికెళ్ళ భ‌ర‌ణి, రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు శ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ లో సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా ఎప్రిల్ 5న సినిమా విడుదల కానుంది. నిన్నుకోరి త‌ర‌హాలోనే ఇది కూడా ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గానే ఉండ‌బోతుంద‌ని చెబుతున్నాడు శివ‌. క‌చ్చితంగా ఈ చిత్రంతో ద్వితీయ‌విఘ్నం దాటేస్తాన‌ని చెబుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అయితే ఎప్రిల్ 5న మ‌జిలితో పాటు మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమా కూడా రానుంది. సూప‌ర్ స్టార్ తో పోటీ ప‌డ‌టానికి సై అంటున్నాడు నాగ‌చైత‌న్య‌. ఇక ఇప్పుడు చైతూ, స‌మంత‌కు కూడా క‌చ్చితంగా హిట్ కావాలి. మ‌రి చూడాలిక‌.. ఈ మ‌జిలితో వాళ్లేం చేస్తారో..? 

More Related Stories