English   

రాజ‌మౌళి సినిమా షూటింగ్ ఎప్ప‌ట్నుంచో తెలుసా..? 

RRR-Movie
2019-01-14 17:59:09

రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు ఆసక్తి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయ‌న‌ సినిమా గురించి తెలుసుకోవడానికి దేశ వ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. బాహుబలి తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ కూడా పూర్తయిపోయింది. ఇది జరిగి కూడా రెండు నెలలు గడిచి పోయింది. నవంబర్ లో తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత కార్తికేయ పెళ్లి కారణంగా రెండు నెలలు ఈ చిత్ర షూటింగ్ పోస్ట్ ఫోన్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు త‌న‌యుడి పెళ్లి కావడంతో మళ్లీ రెండో షెడ్యూల్ వైపు అడుగులు వేస్తున్నారు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్. ఈ చిత్రం రెండో షెడ్యూల్ జనవరి 21 నుంచి మొదలు కానుందని తెలుస్తోంది. 

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఒక భారీ సెట్ ఈ సినిమా కోసం నిర్మించారు. అందులోనే దాదాపు 80 రోజుల పాటు భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. మధ్యలో చిన్న చిన్న బ్రేకులు తీసుకుంటూ ఇక్కడే దాదాపు 40 నుంచి 50 శాతం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శక‌ధీరుడు. అంతేకాదు ఈ సినిమాను అక్టోబ‌ర్ లోపు పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్. రామ్ చరణ్, ఎన్టీఆర్ నుంచి బల్క్ డేట్స్ తీసుకున్నాడు జక్కన్న. జనవరి 21న రెండో షెడ్యూల్ మొదలైన తర్వాత దాదాపు మార్చి వరకు బ్రేకులు లేకుండా ఈ చిత్రం షూటింగ్ జరగనుంది. ఆ లోపు ఎన్టీఆర్, రామ్ చరణ్ సెలవులు ముగించుకొని రానున్నారు. మొత్తానికి పండగ తర్వాత ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఉందన్నమాట.

More Related Stories