English   

శ్రీ దేవి బంగ్లా...శ్రీ దేవి బయోపిక్కా ?

Priya-Prakash
2019-01-14 18:34:30

ఒక్క సారి అలా కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిన ప్రియ ప్రకాష్ వారియర్ గుర్తుండే ఉంటుంది. అయితే ఇంకా తన మొదటి సినిమా ఒరు ఆదుర్ ల‌వ్ మూవీ ఇంకా విడుద‌ల కూడా కాక ముందే ప్రియా ప్ర‌కాష్ ఏకంగా ఒక హిందీ మూవీలో న‌టిస్తూ ఆ సినిమా ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేసేసింది. శ్రీ‌దేవి బంగ్లా పేరుతో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్‌ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక చిన్న పిల్లకి శ్రీ దేవి అంటూ ఆటోగ్రాఫ్‌ ఇస్తున్న సన్నివేశంతో ప్రారంభ‌మైన ట్రైల‌ర్ లో ‘మీకు ఇష్టమైన నటి ఎవరు’ అని ఆ చిన్నారి అడగ్గా ‘నాకు ఇష్టమైన నటి నేనే’ అని ప్రియా అంటుంది. 

ఓ నటిగా నేను చాలా అదృష్టంతురాలిని. నాకు జీవితంలో దేవుడు అన్నీ ఇచ్చాడు. పేరు, డబ్బు, సంతోషం అన్నీ ఇచ్చాడు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకు అభిమానులు ఉన్నారు కానీ అన్న డైలాగ్‌‌ వినిపిస్తున్న టైంలో కాలింగ్‌ బెల్‌ మోగుతుంది. ఆ తర్వాత ప్రియా ఓ పక్క ఏడుస్తూ మరోపక్క మద్యం తాగుతున్నట్లు కన్పించారు. చివర్లో బాత్‌ టబ్‌లో ఓ శవం కాళ్లు చూపించడంతో రియల్ శ్రీ‌దేవి ప్ర‌మాద వ‌శాత్తు బాత్ ట‌బ్ లో మునిగి మ‌ర‌ణించిన సంద‌ర్భాన్ని గుర్తు చేయడం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. అయితే ఇక్కడే అసలు అనుమానాలు మొదలయ్యాయి. 

ఎందుకంటే శ్రీ దేవి బయోపిక్ మొదలుపెడదాం అని ఈ మధ్యే బోణీ కపూర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో అసలు సినిమా మొదలయ్యిందన్న సమాచారం కూడా లేకుండా ఇప్పుడు ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేస్తుండడం మీద అనేక అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఈ ట్రైలర్ లో ఇది నటి శ్రీ దేవికి సంబందించిన సినిమా అని ఎక్కడా పేర్కొనక పోయినా, ఈ ట్రైలర్ లోని అంశాలు ఖచ్చితంగా అందాల నటిని గుర్తు చేస్తున్నాయి. అయితే ఇది బయోపిక్ అయ్యే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. ఎందుకంటే దానికి ఆమె కుటుంబ సభ్యుల సమ్మతి తప్పనిసరి, తను కాకుండా ఇంకెవరు సినిమా తీయిన్చినా తన క్యారెక్టర్ ని తప్పుగా చూపిస్తారో అన్న భయంతో ఉన్న బోనీ ఇప్పటికే ఆ కధకు కాపీ రైట్స్ తీసుకోవాలని కూడా చూస్తున్నాడు. అయితే కేవలం ప్రమోషన్స్ కోసమే కాస్త కలిసేలా ఉన్న కధతో ముందుకు వచ్చు ఉండచ్చని తెలుస్తోంది. 

More Related Stories