English   

లీడర్ బ్యూటీ పెళ్లి.. ప్రేమికుడితో రిచా గంగోపాధ్యాయ ఏడడుగులు..

Richa Gangopadhyay gets engaged to boyfriend Joe Langella
2019-01-17 20:21:16

కొందరు హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీకి మెరుపు తీగల్లా వచ్చి పోతుంటారు. అలాంటి వాళ్ళలో రిచా గంగోపాధ్యాయ కూడా ఉంటుంది. లీడర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. కేవలం నాలుగేళ్ళు మాత్రమే ఇండస్ట్రీ లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ అమెరికాకు చదువుకోవడానికి వెళ్ళిపోయింది. అవకాశాలు వస్తున్నా కూడా పట్టించుకోకుండా తనకు చదివే ముఖ్యం అంటూ యూఎస్ చేరుకుంది ఈ భామ. అయితే సినిమాలకు దూరమైన అభిమానులకు మాత్రం దూరం కాలేదు రిచా. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన విషయాల గురించి చెబుతూనే ఉంది. ఇప్పుడు కూడా మరో ఆసక్తికరమైన విషయం అభిమానులతో పంచుకుంది. రిచా గంగోపాధ్యాయ నిశ్చితార్థం జరిగింది. చాలా రోజులుగా ప్రేమలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ జియో లాంజెల్ ను పెళ్లి చేసుకోబోతుంది రిచా గంగోపాధ్యాయ. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆరేళ్ల కింద నాగార్జునతో నటించిన భాయ్ సినిమా తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. ఇక జీవితంలో సినిమాలు చేయనని కొన్ని రోజులు అలా నటించాలనిపించింది వచ్చాను.. నటించాను.. వెళ్లిపోయాను అంటూ ఇండస్ట్రీకి సెలవిచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి ఆమె పెళ్లితో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. మరి కనీసం పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఎవరినైనా పిలుస్తుందో లేదో చూడాలి.

More Related Stories