English   

మహానాయకుడు వాయిదా...అదే రీజన్ !

NTR Mahanayakudu postponed by a week
2019-01-17 13:58:04

విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా దేశ నలుదిశలా కీర్తినొందిన ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో ఆయనే ఎన్టీఆర్ పాత్రను పోషించిన బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కగా అందులో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదలై, మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టాక్ అయితే మంచిగానే వచ్చింది కానీ అనుకున్నంత మేర కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోతుంది. ఇది సినిమాలా కాకుండా డాక్యుమెంటరీలా సాగిందన్న టాక్ కూడా కథానాయకుడు కలెక్షన్స్ పై బాగా ప్రభావం చూపింది. అందుకే చిత్రబృందం రెండవ భాగం ‘మహానాయకుడు’ మీద స్పెషల్ కేర్ తీసుకుంటుందని తెలుస్తోంది. కొన్ని సీన్లను లేపేసి మరికొన్నిటితో రీప్లేస్ చేయనున్నారట. అందుకే ముందు ప్రకటించినట్టుగా ‘మహానాయకుడు’ని ఫిబ్రవరి 7న విడుదల చేయడం కష్టమేనని, అదీ కాక ఈ సినిమాకు ఇంకా ప‌ది రోజుల షూటింగ్ మిగిలే ఉందట. షూటింగ్ త‌ర్వాత రీ-రికార్డింగ్‌, ఎడిటింగ్‌ వంటి ప‌నులకి సమయం తీసుకుంటుంది కాబట్టి విడుద‌ల‌ను ఒక వారం వెన‌క్కి జ‌ర‌పాల‌ని అనుకుంటున్నార‌ట‌.  అయితే ఈ విడుదల తేదీ మార్పు మీద ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఇది కన్ఫాం అంటున్నారు.

More Related Stories