English   

మెగా మేనల్లుడి సినిమా రిలీజ్ డేట్ లాక్ !

Sai Dharam Tej starrer Movie  'Chitralahari' to release on April 12
2019-01-17 14:03:02

‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో కెరీర్‌ ను ఆరంభించిన మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరం తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’ సినిమాలతో నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత టైం కలిసిరాకో సబ్జెక్ట్ లు తేడా కొట్టో గానీ వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో వచ్చే సినిమాతో అయినా హిట్ కొట్టి టాలీవుడ్‌ లో స్థిరపడాలనే నిశ్చయంతో తేజ్ ఉన్నాడు. అందుకే ఈసారి ‘చిత్రలహరి’ అనే లవ్ స్టోరీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు. ‘సుప్రీం’ సినిమా తర్వాత మళ్లీ హిట్ అనే మాటే గగనం అయిపోవడంతో ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు తేజ్. ‘నేను శైలజ’, ఉన్నదీ ఒకటే జిందగీ సినిమాల దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తేజ్ సరసన కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ లు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ లాక్ చేసుకుంది. ఈ సినిమాని ఈ ఏడాది ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సినిమా టైటిల్‌లో ఉన్న ఐదు అక్షరాలకు అంటే చి,త్ర,ల,హ,రి అనే వాటికి ఈ సినిమాలో ఐదు క్యారెక్టర్స్‌కు సంబంధం ఉంటుందట. ఈ విషయాన్నీ స్వయంగా దర్శకుడే చెప్పుకొచ్చాడు.  అయితే తమ నిర్మాణ సంస్థ మొదలెట్టాక హ్యాట్రిక్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమా తెరకేక్కిస్తోంది. అయితే ఆ తర్వాత రెండు సినిమాలు వారికి దేబ్బెయగా ఈ సినిమా హిట్ ఇచ్చి హ్యాట్రిక్ ఫ్లాప్ నుండి బయటపదేస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు

More Related Stories