English   

క్లారిటీ ఇచ్చిన మురగదాస్

ar murugadoss clears all rumours on his new project
2019-01-17 21:11:00

మహేశ్ బాబు తో స్పైడర్, ఆ తర్వాత విజయ్ తో సర్కార్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు మురుగ దాస్ తన తదుపరి సినిమా మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ చిత్రాల తర్వాత మురుగ దాస్ కొత్త సినిమా ఏంటనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే సంక్రాంతి సందర్భంగా మురుగ దాస్ తన కొత్త మూవీ టైటిల్ ను ప్రకటించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మురుగదాస్ కొత్త చిత్రం పేరు 'నార్కాలి' అని వార్తలు వచ్చాయి. అంతకు ముందు నుండీ ఆయన రజనీతో సినిమా చేస్తున్నాడని ప్రచారం జరగడంతో ఆయనతో తీసే సినిమాకే ఈ టైటిల్ అని అంతా భావించారు. వాస్తవానికి ‘నార్కాలి’ అంటే కుర్చీ దీంతో రాజకీయ ప్రవేశం కోసం చూస్తున్న రజనీకి ఇది యాప్ట్ టైటిల్ అని అంతా భావించారు. అసలు సినిమాకి రాజకీయానికి అవినాభావ సంబంధం ఉన్న తమిళనాడులో ఈ వార్త సంచలనానికి తెర లేపింది. దీంతో ఈ వార్తల మీద అభిమానులకు ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చాడు మురుగ దాస్. నార్కాలి అనేది నా సినిమా అని అందరూ భావిస్తున్నారని కానీ అది నా కొత్త సినిమా టైటిల్ కాదని, ఇకనయినా పుకార్లు సృష్టించడం ఆపేయండని ఆయన ట్వీట్ చేశాడు. మురుగదాస్ తన కొత్త ప్రాజెక్టును స్టార్ హీరోతో తీసేందుకు ప్లాన్ చేశాడని అంటున్నారు కానీ అది ఎవరు అనే దాని మీద మాత్రం ఎటువంటి అధికారిక సమాచారం లేదు. దీంతో మురుగదాస్ కొత్త సినిమా ఎవరితో తీస్తాడు అనే దాని మీద ఆసక్తి నెలకొంది

More Related Stories