English   

కార్తికేయ సినిమా షూటింగ్ స్టార్ట్ !

rx 100 hero kartikeya gummakonda new movie begins with debutant director arjun jandhyala
2019-01-17 14:19:50

ఆ సినిమా రాకముందు వరకూ కార్తికేయ అంటే ఎవరికీ తెలియలేదు. ఆయన హీరోగా ఒక సినిమా వచ్చినా ఆయన పెద్దగా ఎవరికీ తెలీదు. అలాంటిది ఏ ముహూర్తాన వచ్చిందో తెలీదు కానీ ఆర్ఎక్స్ 100 సినిమా తక్కువ బడ్జెట్ లోనే తీసినా భారీ విజయాన్ని అందుకుని ఆయనకి విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఈ మధ్య ఆయన రెండవ సినిమాగా హిప్పీ అనే బైలింగ్యుయాల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మూడో సినిమాగా ఈ మధ్యే గతంలో బోయపాటి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సినిమా మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ సినిమా ఫస్టు షెడ్యూల్ ను ఒంగోలులో ప్లాన్ చేశాడట. అక్కడ ఈ రోజున నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అయితే హీరోయిన్ ఎంపిక ఇంకా జరగని ఈ సినిమాకి సంబందించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆరేక్స్ 100 లో యాంగ్రీ యాంగ్ మాన్ గా కనిపించిన కార్తికేయ ఈ సినిమాలో ఎలా కనిపించనున్నాడో మరి.

More Related Stories