English   

నా క‌ష్టాల గురించి మీకేం తెలుసు అంటున్న స్నేహ‌..

Sneha about her persona llife
2019-01-17 21:39:16

హీరోయిన్ లైఫ్ అంటే చాలా జాలిగా ఉంటుందని.. వాళ్లకు ఎలాంటి కష్టాలు ఉండమని బయట వాళ్ళు చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటిదేమీ ఉండదని.. చాలా చుక్కలు కనిపిస్తాయని చెబుతుంది స్నేహ. ఆలీతో సరదాగా ప్రోగ్రాం కు వచ్చింది ఈ భామ‌. ఇందులో చాలా విషయాలు పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తన పర్సనల్ లైఫ్ గురించి చాలా విషయాలు ప్రేక్షకులకు చెప్పింది స్నేహ. పుట్టింది ముంబై.. పెరిగింది దుబాయ్.. షిఫ్ట్ అయింది చెన్నై.. అందుకే త‌న పూర్వీకుల గురించి కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది స్నేహ‌. చెన్నైలో షిఫ్ట్ కావడంతో తమిళమ్మాయి అంత ఫిక్సయినట్లు గుర్తు చేసుకుంది స్నేహ. ఇంటర్ తర్వాత సినిమాల్లోకి వచ్చానని.. అయితే తొలి సినిమాకి చుక్కలు కనిపించాయని.. ఆ బాధలు తట్టుకోలేక దుబాయ్ వెళ్లిపోదామని ఫిక్సయిపోతే అమ్మానాన్నలే పట్టుబట్టి మరీ సముదాయించార‌ని గుర్తుచేసుకుంది స్నేహ.
ప్రసన్నతో ప్రేమ గురించి కూడా ఓపెన్ అయింది స్నేహ. ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా చూసి తనకు కోపం పెరిగిందని ఆ తర్వాత కలిసి చేసిన సినిమాలో కూడా మాట్లాడలేదని గుర్తు చేసుకుంది స్నేహ. కానీ తన గురించి తెలుసుకున్న తర్వాత తనే వచ్చి ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడని వెంటనే తను కూడా ఒప్పుకున్నట్లు చెప్పింది స్నేహ. అయితే వాళ్లింట్లో ఎలాంటి సమస్య లేకపోయినా కూడా ప్రసన్న ఇంట్లో మాత్రం ఏడాదిపాటు ఒప్పుకోలేదు.. గొడవ పడ్డారు.. కానీ చివరికి ఎలాగోలా పెళ్లి చేసుకున్న‌ తర్వాత తన గురించి తెలుసుకొని అత్త‌మామ‌లు ఇప్పుడూ హ్యాపీగా ఉన్నారని అదే తనకు సంతోషాన్ని కలిగించే విషయం అంటుంది స్నేహ. మొత్తానికి ఒక్క‌ ఇంటర్వ్యూలో తన జీవితం మొత్తం బయట పెట్టేసింది ఈ భామ.

More Related Stories