English   

న‌రేష్ వార‌సుడు గురించి ఊరంతా అనుకుంటున్నారు తెలుసా..

Oorantha Anukuntunnaaru' is a village-based drama
2019-01-17 14:50:22

కొందరు వారసులకు విజయం అందని ద్రాక్షగా ఉంటుంది. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విజయం మాత్రం దరికిరాదు. ఇప్పుడు హీరో సీనియర్ నరేష్ కుమారుడు విజయ్ కృష్ణ కూడా ఇదే చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు చేసినా కూడా ఆయనకు అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడు మూడో సినిమాతో వస్తున్నాడు ఈ హీరో. ఊరంతా అనుకుంటున్నారు అనే టైటిల్ తో ఈ సినిమా వస్తుంది. బాలాజీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అవసరాల శ్రీనివాస్ ఇందులో విజయ్ తో పాటు నటిస్తున్నాడు. ఈ హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కచ్చితంగా ఈ చిత్రంతో విజయం అందుకుంటారని ధీమాగా చెబుతున్నారు విజయ్ కృష్ణ. ఈయన సినిమాలకు మహేష్ బాబు కూడా బ్రాండింగ్ చేస్తున్నాడు కానీ ఇప్పటివరకు ఒక విజయం కాదు కదా కనీసం ప్రేక్షకుల దృష్టిలో గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయాడు విజయ్ కృష్ణ. కానీ మూడో సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తాన‌ని ధీమాగా చెబుతున్నాడు ఈ కుర్ర హీరో. మరి ఈ నమ్మకాన్ని ఊరంతా అనుకుంటున్నారు సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

More Related Stories